ప్రపంచ కప్ 2019: 23ఏళ్ళ తర్వాత మళ్లీ...జో రూట్ అరుదైన రికార్డు

By Arun Kumar PFirst Published Jun 15, 2019, 4:22 PM IST
Highlights

ప్రపంచ కప్ మెగా టోర్నీలో ఆతిథ్య ఇంగ్లాండ్ మరో అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వెస్టిండిస్ తో జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య జట్టు అటు బౌలింగ్, పీల్డింగ్, ఇటు బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ ను ఇంగ్లాండ్ గెలుచుకుంది అనే  బదులు ఆల్ రౌండర్ జో రూట్ గెలిపించాడు అనడం సమంజసంగా వుంటుందేమో. తన ఆలౌరౌండ్ ప్రదర్శనతో రూట్ జట్టును గెలిపించడమే కాదు ఓ అరుదైన ప్రపంచ  రికార్డును సాధించి చరిత్ర సృష్టించాడు.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ ను తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో రూట్ తనవంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే రెండు వికెట్లు పడగొట్టడంతో పాటు అద్భుతమైన ఫీల్డింగ్ తో రెండు క్యాచ్ ను అందుకున్నాడు. ఇలా ప్రత్యక్షంగా ఇద్దరిని...పరోక్షంగా  మరో ఇద్దరిని  పెవిలియన్ కు పంపాడన్నమాట. ఇలా ఇంగ్లీష్ బౌలర్లు దెబ్బతీయడంతో విండీస్ కేవలం 212 పరుగులకే చాపచుట్టేసింది.  

ఆ తర్వాత బ్యాటింగ్ లోనే రూట్ హవా  కొనసాగింది. గాయం కారణంగా జాసన్ రాయ్ ఓపెనింగ్ చేయకపోవడంతో అతడి స్థానంలో బెయిర్ స్టో తో కలిసి రూట్ ఓపెనర్ గా బరిలోకి దిగాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రూట్ 94 బంతుల్లోనే సెంచరీ చేసి ఇంగ్లాండ్ ను విజయతీరాలకు చేర్చాడు.

ఇలా బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ లో అదరగొట్టిన రూట్ ఖాతాలోకి ఓ  అరుదైన రికార్డు చేరింది. ఇలా  ఒకే మ్యాచ్ లో సెంచరీతో పాటు రెండు వికెట్లు,  రెండు క్యాచులను అందుకుని ఆల్ రౌండ్ ప్రదర్శన చేశాడు. ఇలా అన్ని విభాగాల్లో రాణించిన అతడు శ్రీలంక క్రికెటర్  అరవింద డిసిల్వా  తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. 1996 ప్రపంచ కప్ లో డిసిల్వా ఇలాగే  సెంచరీ బాదడంతో పాటు  మూడు వికెట్లు, రెండు క్యాచులను అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అలాంటి ప్రదర్శన చేయడం రూట్ కే  సాధ్యమయ్యింది. 
 
click me!