ఇండో పాక్ మ్యాచ్... అంతా ధోనీయే చూసుకుంటాడు: పాక్ అభిమాని

By Arun Kumar PFirst Published Jun 15, 2019, 3:39 PM IST
Highlights

భారత్-పాకిస్థాన్ మ్యాచ్. ఈ  మాట వింటేనే దాయాది దేశాల్లోని క్రికెట్ అభిమానులకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. టోర్నీ  ఏదైనా సరే ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే అభిమానులకు పండగే. ఇక ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీల్లో అయితే ఈ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు క్రేజ్ ఓ రేంజ్ లో వుంటుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్ చూడాలంటే సామాన్యుడితే అయ్యే పని కాదు. కానీ ఓ పాక్ అభిమాని మాత్రం ఇంగ్లాండ్ వేదికగా జరిగే ప్రపంచ కప్ కు పయనమయ్యాడు. మరి టికెట్ ఎలా అంటే...మా ధోని భయ్యా చసుకుంటాడని సమాధానమిస్తున్నాడు. పాక్ అభిమాని ధోని పేరు చెప్పడమేంటని  ఆశ్యర్యపోతున్నారా...? అయితే  మీరీ స్టోరీ చదవాల్సిందే. 

ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ వేదికగా రేపు(ఆదివారం) ఇండో పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం  దాదాపు నెలరోజుల క్రితమే బుకింగ్స్ ఓపెన్ చేయగా కొన్ని గంటగల వ్యవధిలోనే టికెట్లన్ని అమ్ముడుపోయాయి. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ చూడాలని ఆశపడుతున్నవారికి కొందరు బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారు. వాటి ధరలు  దాదాపుగా 20-60 వేల వరకు పలుకుతున్నాయి. 

ఈ సమయంలో పాకిస్థాన్ కు చెందిన ధోని వీరాభిమాని మహ్మద్ బషీర్ కూడా ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు ఇంగ్లాండ్ కు వెళ్లాడు. కానీ అతడి వద్ద  టికెట్ మాత్రం లేదు. టికెట్ లేకుండా మ్యాచ్ ఎలా చూస్తావని ప్రశ్నిస్తే అన్నీ ధోని చూసుకుంటానన్నాడని  సమాధానం చెబుతున్నాడు. అతడు ఈ మ్యాచ్ టికెట్ ఇప్పిస్తానని హామీ ఇవ్వడం  వల్లే ఇక్కడికి వచ్చానని  బషీర్  వెల్లడించాడు. 

 ''మహేంద్ర సింగ్ ధోని సాబ్ తో నేను టచ్ లో వుంటాను. అప్పుడప్పుడు అతడికి  మెసేజ్ చేయగా రిప్లై కూడా వస్తుంది. అలా ఈ మ్యాచ్ టికెట్ కావాలని  కోరగా ఇప్పిస్తానని ధోని హామీ  ఇచ్చాడు. అతడి సాయంతోనే ఈ మ్యాచ్ చూస్తాను.'' అని  బషీర్ పేర్కొన్నాడు.   
 
click me!