గతంలోనే కాదు...ఈసారి కూడా కోహ్లీపై నాదే పైచేయి: మోయిన్ అలీ సవాల్

By Arun Kumar PFirst Published Jun 29, 2019, 8:55 PM IST
Highlights

ఈ ప్రపంచ కప్ టోర్నీలో రేపు(ఆదివారం) మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. వరుస విజయాలతో ఓటమన్నదే లేకుండా దూసుకుపోతున్న టీమిండియా ఆతిథ్య ఇంగ్లాండ్ తో బర్మింగ్ హామ్ వేదికన తలపడనుంది. ఇప్పటికే పాకిస్థాన్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లను మట్టికరిపించిన భారత జట్టుకు ఈ మ్యాచ్ ద్వారా మరో సవాల్ ఎదురుకానుంది. అయితే స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ ఆడుతున్న ఇంగ్లాండ్‌ నాకౌట్ దశనుండే వెనుదిరిగి  పరువు పోగొట్టుకోకుండా వుండాలంటే ఈ మ్యాచ్ చాలా కీలకమైనది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో టీమిండియాపై గెలవాలని భావిస్తున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు అంతకంటే ముందే మాటల యుద్దం మొదలుపెట్టారు. 
 
ఇంగ్లాండ్ బౌలర్ మోయిన్ అలీ టీమిండియాపై గతంలో తనకు మంచి రికార్డుందని గుర్తుచేశాడు. మరీ ముఖ్యంగా అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటికే టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీని ఆరుసార్లు ఔట్ చేసినట్లు అలీ తెలిపాడు. కాబట్టి రేపటి మ్యాచ్ లో కూడా మరోసారి కోహ్లీ వికెట్ తొందరగానే పడగొట్టి సత్తా చాటుతానని అన్నాడు. అతడిని తొందరగా ఔట్ చేయగలిగితే తాము సగం మ్యాచ్ గెలిచినట్లేనని అలీ పేర్కొన్నాడు. 

కోహ్లీ ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే అతన్ని ఆపడం చాలా కష్టం.  కాబట్టి అతన్ని ఎంత తొందరగా పెవిలియన్ కు పంపిస్తే అంత మంచిది. అలా అతడి పని పట్టడానికే తాను  ఇక్కడ వున్నానని అన్నాడు. నన్ను ఎదుర్కోడానికి కోహ్లీ సిద్దంగా వుండాలని అలీ సవాల్ విసిరాడు. 

ఇంగ్లాండ్ వరుసగా ఆస్ట్రేలియా, శ్రీలంక చేతిలో ఓటమితో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం  చేసుకుంది. దీంతో ఆ జట్టు సొంత అభిమానులు, మాజీల నుండి విమర్శలను ఎదుర్కొంటోంది. దీనిపై స్పందించిన మొయిన్ అలీ... విజయాలు సాధించినపుడు ప్రశంసలు, అపజయాలను పొందినపుడు విమర్శలను ఎదురవడం తమకు అలవాటేనన్నాడు. అయితే ఈ ఓటముల ప్రభావం  గానీ... ఒత్తిడి గానీ తదుపరి మ్యాచ్ లో తమపై వుండదని అలీ స్పష్టం చేశాడు. 

click me!