ప్రపంచ కప్ 2019: ధోని స్లో బ్యాటింగ్ కు కారణమదే..: బుమ్రా

By Arun Kumar PFirst Published Jun 29, 2019, 7:34 PM IST
Highlights

మహేంద్ర సింగ్ ధోని పేరు వినగానే అభిమానులకు గుర్తొచ్చేది ధనాధన్ ఇన్నింగ్స్. అతడి బ్యాటింగ్ చేస్తున్నాడంటే బౌండరీల మోత ఖాయమని అందరూ భావిస్తుంటారు. తనదైన స్టైల్ హెలికాప్టర్ షాట్లతో బంతిని గింగిరాలు తిప్పుతూ బౌండరీ బాదడం ధోనికే చెల్లింది. అలాంటి విధ్వంసకర ఆటగాడు ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో మాత్రం భిన్నమైన ఆటతీరుతో అభిమానులనే కాదు మాజీలు, విశ్లేషకులను కూడా నిరాశపరిచాడు. స్లో బ్యాటింగ్ తో విసుగు తెప్పించేలా సాగుతున్న అతడి ఇన్నింగ్స్ ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ధోని నెమ్మదిగా బ్యాటింగ్ చేయడానికి గల కారణాలను తాజాగా బౌలర్ బుమ్రా భయటపెట్టాడు. 

ధోని నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన అప్ఘాన్, వెస్టిండిస్ రెండు మ్యాచుల్లో టీమిండియా టాప్ ఆర్డర్ విఫలమైన విషయాన్ని బుమ్రా గుర్తుచేశాడు. ఇలా జట్టు క్లిష్ట పరిస్థితుల్లో వున్నపుడు ఆవేశంతో కాకుండా ఆలోచనతో బ్యాటింగ్ చేయడం ధోనికే చెల్లింది. కాబట్టి అతడు సాధించిన టాప్ ఇన్నింగ్సుల్లో ఈ రెండింటిని కూడా చేర్చడం సమంజసంగా వుంటుందని బుమ్రా పేర్కొన్పాడు. 

ఇలా అప్ఘాన్, విండీస్ మ్యాచుల్లో ధోని సమయోచితంగా బ్యాటింగ్ చేసి జట్టుకు విలువైన పరుగులు అందించాడని అన్నాడు. తీవ్ర ఒత్తిడిని తట్టుకొని అతడు ఈ పరుగులు సాధించాడు. మరీ  ముఖ్యంగా అప్ఘాన్ మ్యాచ్ లో అతడు సాధించిన పరుగులే చాలా కీలల పాత్ర పోషించాయి. ఆ  మ్యాచ్ లో టీమిండియా స్కోరు  ఏమాత్రం తగ్గినా ఫలితం మరోలా వుండేదన్నాడు. 

కాబట్టి ధోనిని విమర్శించే వారు అతడి స్లో బ్యాటింగ్ గురించి కాకుండా ఎలాంటి సమయంలో అతడలా ఆడాడో  గుర్తించాలని సూచించాడు. తన దృష్టిలో అయితే ధోని గతంలో కంటే అద్భుతంగా ఆడాడని... ఆదే అతడి టాప్‌ రేటింగ్‌ ఇన్నింగ్సని పేర్కొన్నాడు. ధోని బ్యాటింగ్ లో రాణించడం మూలంగానే టీమిండియా గౌరవప్రదమైన 268 పరుగులు చేయగలిగిందని బుమ్రా పేర్కొన్నాడు.  
 
click me!