లార్డ్స్ లో ఫైనల్... ఇంగ్లాండ్ చేతితో టీమిండియాకు తప్పని ఓటమి: మిథాలీ రాజ్

By Arun Kumar PFirst Published Jul 9, 2019, 8:35 PM IST
Highlights

భారత  పురుషుల జట్టు ప్రపంచ కప్ ట్రోఫీతోనే స్వదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు టీమిండియా మహిళా ప్లేయర్, మాజీ సారథి మిథాలీ రాజ్ తెలిపారు. 2017 మహిళా ప్రపంచ కప్ లో ఇదే లార్డ్ మైదానంలో తాము తృటిలో ట్రోఫీని మిస్సయ్యామని ఆమె గుర్తుచేసుకున్నారు. కానీ కోహ్లీసేన తాము చేయలేని పనిని చేసి చూపిస్తుందన్న నమ్మకం వుందన్నారు. తప్పకుండా లార్డ్స్ లో జరిగే ఫైనల్లో ప్రత్యర్థి ఎవరైనా గెలుపు మాత్రం భారత జట్టుదేనని మిథాలీ స్పష్టం చేశారు. 

అయితే ప్రస్తుతం జరుగుతున్న సెమీఫైనల్లో న్యూజిలాండ్ ను అంత తక్కువగా అంచనా వేయొద్దని సూచించారు. ఆ జట్టు భారత ఆటగాళ్లను ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాలతో రంగంలోకి దిగే అవకాశాలున్నాయని...కాబట్టి జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుందన్నారు. మరీ ముఖ్యంగా ఈ టోర్నీలో దూసుకుపోతున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, యార్కర్ స్పెషలిస్ట్ బుమ్రాలపై వారు ప్రత్యేక నిఘా వుంచుతారు. వీరిద్దరిని అడ్డుకోవడంపైనే కివీస్ ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. కాబట్టి టీమిండియా కూడా అందుకు ధీటుగా జవాభిచ్చేలా ప్రత్యేక ప్రణాళికలతో రంగంలోకి దిగాలని మిథాలీ సూచించారు. 

తాము 2017 మహిళా ప్రపంచ కప్ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్ ను తక్కువగా అంచనావేయడం వల్లే దెబ్బతిన్నామని వెల్లడించారు. లార్డ్స్ వేదికన జరిగిన ఫైనల్లో మరింత మెరుగ్గా ఆడాల్సిందన్నారు. తాము తృటిలో చేజార్చుకున్న ప్రపంచ కప్ ట్రోఫీని అదే లార్డ్స్ వేదికన కోహ్లీ సేన సాధిస్తుందని బలంగా నమ్ముతున్నట్లు మిథాలీ పేర్కొన్నారు.   

click me!