ఐసిసి ప్రపంచ కప్... భారత జట్టే కాదు అభిమానులూ రికార్డు సృష్టించారు

By Arun Kumar PFirst Published Jul 9, 2019, 6:24 PM IST
Highlights

క్రికెట్... భారత దేశంలో ఈ క్రీడ తెలియనివారు వుండరంటే అతిశయోక్తి లేదు. చిన్న పిల్లల నుండి  పండు ముసలి వరకు క్రికెట్ అభిమానులున్న ఏకైక దేశం ఇండియా. ఇక యువతరమైతే క్రికెట్ ఆడాలన్నా...చూడాలన్నా తెగ ఇష్టపడతారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రికెట్ మ్యాచులంటే భారతీయులు పడిచస్తారు. అలాంటిది ప్రపంచ కప్ ఫీవర్ ఇక్కడ ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. 

క్రికెట్... భారత దేశంలో ఈ క్రీడ తెలియనివారు వుండరంటే అతిశయోక్తి లేదు. చిన్న పిల్లల నుండి  పండు ముసలి వరకు క్రికెట్ అభిమానులున్న ఏకైక దేశం ఇండియా. ఇక యువతరమైతే క్రికెట్ ఆడాలన్నా...చూడాలన్నా తెగ ఇష్టపడతారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రికెట్ మ్యాచులంటే భారతీయులు పడిచస్తారు. అలాంటిది ప్రపంచ కప్ ఫీవర్ ఇక్కడ ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. 

 ఈ మెగా టోర్నీ ఆరంభమవడంతోనే క్రికెట్ ప్రియులు వీలుంటే మైదానంలోనో,  లేకపోతే టీవీలు, ఇంటర్నెట్ ద్వారానో ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ టోర్నీ ప్రత్యక్షంగా ప్రసారమవుతున్నా ఇండియాలోనే  అత్యధిక వ్యూయర్ షిప్ కలిగివుంది.

డబ్బులున్న బడాబాబులు, ఇంగ్లాండ్ లో సెటిలైన ప్రవాసులు తప్ప ప్రపంచ కప్ ను మైదానానికి వెళ్లి ప్రత్యక్షంగా వీక్షించాలంటే భారత దేశంలో సామాన్య అభిమానికి కుదరని పని. దీంతో వారంతా టీవీలకే అతుక్కుపోతున్నారు. ఇటీవల దాయాదులు ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ ను చూసేందుకు చాలామంది తమ పనులు మానుకొని ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఈ ప్రపంచ కప్ టోర్నీలోనే అత్యధిక వ్యూయర్ షిప్ కలిగిన మ్యాచ్ గా ఇండో పాక్ మ్యాచ్ చరిత్ర సృష్టించింది. 

భారత జట్టు కాస్త ఆలస్యంగా ఈ టోర్నీని ఆరంభించింది. అయితే అప్పటివరకు జరిగిన మ్యాచుల్లో మైదానానికి వచ్చిన అభిమానుల సంఖ్య చాలా తక్కువగా వుంది. అయితే టీమిండియా ఆడిన మ్యాచ్ లకు మాత్రం అభిమానులు మైదానానికి  తండోపతండాలుగా తరలివచ్చారు. ఇండో పాక్ మ్యాచ్ కు అయితే చాలా మంది వేలల్లో డబ్బు చెల్లించి టికెట్లు బ్లాక్ లో కొనుక్కుని చూశారట. ఇందుకు కారణం ఇంగ్లాండ్ లో అత్యధికంగా వున్న భారతీయులు. వారు స్వదేశానికి మద్దతిచ్చేందుకు మైదానానికి తరలిరావడంతో స్టేడియం మొత్తం  నీలివర్ణంతో, త్రివర్ణ పతాకాలతోనే కనిపించేది. 

ఇంగ్లాండ్-టీమిండియా మధ్య  జరిగిన మ్యాచ్ లో ఏకంగా ఇయయాన్ మోర్గానే ఇండియాకు లభిస్తున్న సపోర్ట్ ను చూసి ఆశ్చర్యపోయాడు. అసలు మ్యాచ్ ఇండియాలో జరుగుతుందేమో అన్న అనుమానం కలిగిందని ఫన్నీగా కామెంట్ చేశాడు. దీన్ని  బట్టే టీమిండియా  మ్యాచులకు లభిస్తున్న ఆదరణ ఎలా  వుందో ఊహించొచ్చు. ఇలా ప్రపంచ కప్ టోర్నీకి భారతీయ అభిమానుల వల్లే కళ వచ్చింది  అనడంలో అతిశయయోక్తి లేదు. 
 

click me!