ఇంగ్లాండ్ కు ఊరట...కేవలం జరిమానాతో బయటపడ్డ ఓపెనర్ జేసన్ రాయ్

By Arun Kumar PFirst Published Jul 12, 2019, 6:15 PM IST
Highlights

స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ ద్వారా విశ్వవిజేతగా నిలవాలని ఇంగ్లాండ్  ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం కేవలం మరో అడుగు దూరంలో మాత్రమే ఆ జట్టు నిలిచింది. ఈ నెల 14వ తేదీన లార్డ్స్ వేదికన జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్ తో మోర్గాన్ సేన తలపడనుంది. అయితే ఇలా ఫైనల్ పోరాటానికి సిద్దమవుతున్న ఇంగ్లీష్ జట్టు పెద్ద గండం నుండి తప్పించుకుంది.  

ఈ మెగా టోర్నీ ఆరంభం నుండి ఇంగ్లాండ్ ఓపెనర్లు జేసన్ రాయ్, బెయిర్ స్టో లు అద్భుతంగా ఆడుతున్నారు. అలా సెమీఫైనల్లోనూ వారి జోరు కొనసాగింది. అయితే ఇలా సెంచరీవైపు దూసుకుపోతున్న సమయంలో ఓపెనర్ జేసన్ రాయ్ అంపైర్ ధర్మసేన తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. ఇలా 87 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటై సెంచరీకి కొద్దిదూరంలో నివలవడంతో అతడు కోపాన్ని అదుపుచేయలేకపోయాడు. తనను ఔట్ గా ప్రకటించిన అంపైర్ ధర్మసేనను దుర్భాషలాడుతూ మైదానాన్ని వీడాడు. 

అయితే అతడు అంపైర్ ను అసభ్య పదజాలంతో దూషించడం స్టంప్ మైక్ లో రికార్డయ్యింది. ఇలా అంపైర్ పట్ల అమర్యాదగా ప్రవర్తించిన అతడిపై ఐసిసి కఠినంగా వ్యవహరిస్తుందని అందరూ భావించారు. తప్పకుండా ఓ మ్యాచ్ నిషేదాన్ని ఎదర్కొవాల్సి  వస్తుందని అనుకున్నారు. అలా అతడు ప్రపంచ  కప్ ఫైనల్ కు దూరమయితే ఇంగ్లాంండ్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలేది. 

అయితే అతడు  చేసింది తప్పే అయినా అంఫైర్ నిర్ణయంలో  కూడా లోపాలుండటాన్ని ఐసిసి గుర్తించింది. అలాగే తదుపరి మ్యాచ్ కూడా చాలా కీలకమైంది కావడంతో జేసన్ రాయ్ ని కేవలం జరిమానాతో వదిలేసింది. అతని మ్యాచ్ ఫీజు నుంచి 30శాతం జరిమానాతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లు కూడా విధించింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఊపిరిపీల్చుకుంది. 
 
click me!