ఇంగ్లాండ్, కివీస్ ల మద్య ఫైనల్... టీమిండియానే కారణం: మైఖేల్ వాన్

By Arun Kumar PFirst Published Jul 12, 2019, 5:29 PM IST
Highlights

ప్రపంచ కప్  2019 ఫైనల్లో తలపడే జట్లేవో తేలిపోయింది. ఆతిథ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికన టైటిల్ కోసం తలపడనున్నాయి. అయితే ఫైనల్ కు చేరిన ఈ రెండు జట్లు మాత్రమే ఈ మెగా టోర్నీ మొత్తంలో భారత్ ను ఓడించగలిగాయి. ఇలా భారత జట్టు జోరును అడ్డుకున్న జట్లే ఫైనల్ కు చేరతాయన్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ ముందుగానే చెప్పిన మాట నిజమయ్యింది. 

ఇదే విషయాన్ని వాన్ మరోసారి గుర్తుచేస్తూ ఓ ట్వీట్ చేశారు. '' నేను ఎప్పుడో చెప్పా టీమిండియాను ఓడించి జట్టే ఈ ప్రపంచ కప్ లో గెలుస్తుందని'' అంటూ గతంలో తాను చెప్పిన మాటలను గుర్తుచేశాడు. 

గతంలో టీమిండియా లీగ్ దశలో దూసుకుపోతున్న సమయంలో వాన్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అతడు టీమిండియా జోరును అడ్డుకున్న జట్టే ఈ ప్రపంచ కప్ విజేతగా నిలుస్తుందని కామెంట్ చేశాడు. అతడు చెప్పినట్లే లీగ్ దశలో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమిని చవిచూసింది. మొత్తం ఎనిమిది మ్యాచుల్లో ఏడు విజయాలను అందుకున్న భారత్ ను కేవలం ఆతిథ్య జట్టు మాత్రమే ఓడించగలిగింది. 

ఇక ఆ తర్వాత మళ్లీ మాంచెస్టర్ వేదికన జరిగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. దీంతో ఈ మెగా టోర్నీలో టీమిండియా ఆట ముగిసింది. అయితే ఆ వరల్డ్ కప్ లో భారత్ కేవలం ఇంగ్లాండ్, కివీస్ చేతుల్లోనే ఓడిపోగా ఆ రెండు జట్లే ఫైనల్ కు చేరాయి. వాటిల్లో ఏదో ఒక జట్టు 2019 ప్రపంచ కప్ ట్రోఫీనే కాదు మొదటిసారి విశ్వవిజేతగా నిలవనుంది. ఇలా మైఖేల్ వాన్ ఊహించినట్లే టీమిండియాను ఓడించిన జట్టే ప్రపంచ కప్ విజేత కానుంది.

Always said whoever Beats India will the win the World Cup ... 👍

— Michael Vaughan (@MichaelVaughan)

click me!