ప్రపంచ కప్ 2019: తొలి మ్యాచ్ లోనే ధోని రికార్డుల మోత

By Arun Kumar PFirst Published Jun 6, 2019, 6:05 PM IST
Highlights

ప్రపంచ కప్ సీజన్ 12లో టీమిండియా మొదటి మ్యాచ్ లోనే అదరగొట్టింది. సౌతాంప్టన్ వేదికన దక్షిణాఫ్రికా తో తలపడ్డ భారత జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్, మరోపక్క ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించి అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని కొన్ని అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఈ మ్యాచ్ ద్వారా ధోని వికెట్ కీపింగ్ చేసిన ఇన్నింగ్సుల సంఖ్య 600 చేరింది. ఇలా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ఇన్నింగ్సుల్లో వికెట్ కీపర్ గా వ్యవహరించిన రికార్డు ధోని ఖాతాలోకి చేరుకుంది. అంతకు ముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ బౌచర్ (596 ఇన్నింగ్సులు) పేరిట వుండేది.  ఆ రికార్డును ఇదివరకే బద్దలుగొట్టిన ధోని  ఈ మ్యాచ్ ద్వారా 600 మార్కును చేరుకున్నారు. వీరి తర్వాతి స్థానాల్లో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ సంగక్కర (499), ఆసిస్ వికెట్ కీపర్ గిల్ క్రిస్ట్ (485) నిలిచారు.  

ఇక ఇదే మ్యాచ్ లో ఫెహ్లుక్వాయోను ధోని స్టంపౌట్ చేశాడు. దీంతో కలిసి అతడి స్టంపౌట్ల సంఖ్య 139 కి చేరుకుంది. ఇలా పాకిస్థాన్ మాజీ వికెట్ మొయిన్ అలీ పేరిట వున్న అత్యధిక స్టంపౌట్ల రికార్డును సమం చేశాడు. ధోని ఖాతాలో మరో స్టంపౌట్ చేరితే మొయిన్ అలీ రికార్డు  బద్దలు  కానుంది. 

ఇక కేవలం ప్రపంచ కప్ స్టంపౌట్ల విషయానికి వస్తూ ధోని మూడో స్థానంలో నిలిచాడు. ఈ  జాబితాలో మొదటి స్థానంలో సంగక్కర 54 వికెట్లు, గిల్ క్రిస్ట్ 52 వికెట్లతో రెండో స్థానం, ధోని 33 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు. అయితే వారిద్దరు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు కాబట్టి వరల్డ్ కప్ చివరివరకు ఈ రికార్డు కూడా ధోని ఖాతాలోకి చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 

click me!