భారత్-కివీస్ సెమీఫైనల్... ధోని ఖాతాలో మరో వరల్డ్ రికార్డు

By Arun Kumar PFirst Published Jul 9, 2019, 4:03 PM IST
Highlights

ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా అద్భుతంగా ఆడుతూ సెమీస్ కు చేరుకుంది. అయితే జట్టు మొత్తం అద్భుతంగా రాణిస్తున్నా ఎంఎస్ ధోని మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. అయినప్పటికి ప్రస్తుతం టీమిండియా-న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ ద్వారా అతడి  ఖాతాలోకి ఓ అరుదైన ప్రపంచ రికార్డు వచ్చి చేరింది.

ఈ మ్యాచ్ ద్వారా ధోని 350 వన్డేలను పూర్తిచేసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో ఏ వికెట్ కీపర్  కూడా ఇన్ని మ్యాచులు ఆడలేదు. దీంతో అత్యధిక మ్యాచుల్లో వికెట్ కీపర్ గా వ్యవహరించిన ఏకైక క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు. 

ఇక టీమిండియా తరపున కూడా అత్యధిక వన్డేలాడిన రెండో క్రికెటర్ గా ధోని నిలిచాడు. అత్యధిక మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించిన భారత క్రికెటర్ గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(463 వన్డేలు) మొదటి స్థానంలో నిలవగా 350 మ్యాచులతో ధోని రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఇక అంతర్జాతీయ స్థాయిలో ఈ ఘనత  సాధించిన క్రికెటర్ల జాబితాలో ధోని టాప్ టెన్ లో నిలిచాడు. 

ఇలా తన కెరీర్లో గుర్తుండిపోయే మ్యాచ్ లో అయినా ధోని సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ధోని ఇప్పటివరకు అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ఆడలేకపోయాడు. పరుగులు సాధించడంలో మరీ ఇబ్బంది పడిపోతూ నత్తనడకన సాగుతున్న అతడి బ్యాటింగ్ పై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు ధోనీ స్లో బ్యాటింగ్ విసుగు తెప్పిస్తోందని...గతంలో మాదిరిగా అతడి నుండి ధనాధన్ ఇన్నింగ్స్ చూడాలనుకుంటున్నామని కోరుతున్నారు. వారి కోరిక ఈ మ్యాచ్ లో నెరవేరుతుందేమో చూడాలి మరి. 
 
click me!