నాలుగుసార్లు అతడే....ఈసారి కూడా రోహిత్ పై కివీస్ వ్యూహం అదేనా...?

By Arun Kumar PFirst Published Jul 9, 2019, 2:36 PM IST
Highlights

ఈ ప్రపంచ కప్ లో చెలరేగుతున్న టీమిండియా  ఓపెనర్ రోహిత్ శర్మను తొందరగా  పెవిలియన్ కు పంపేందుకు పక్కా వ్యూహాలతో బరిలోకి దిగుతున్నట్లు కివీస్ కెప్టెన్ విలియమ్సన్ వెల్లడించాడు. 

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. అతడు ఇప్పటివరకు ఎనిమిది మ్యాచుల్లో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ బాది రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికే 647 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన అతడు సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై కూడా చెలరేగడానికి సిద్దంగా వున్నాడు.  అయితే ఈ మ్యాచ్ లో అతడికి ట్రెంట్ బౌల్ట్ రూపంలో ప్రమాదం పొంచివుంది.  రోహిత్ ఈ కివీస్ బౌలర్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే మటుకు సెమీస్ లో టీమిండియాకు ఎదవురుండదని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. 

ఈ ప్రపంచ కప్ లో అద్భుత విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాను ఎదుర్కోడానికి పక్కా వ్యూహాలతో బరిలోకి దిగనున్నట్లు కివీస్  కెప్టెన్ విలియమ్సన్ వెల్లడించాడు. ముఖ్యంగా భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నరోహిత్ అడ్డుకుంటే తాము సగం విజయం సాధించినట్లేనని పేర్కోన్నాడు. కాబట్టి గతంలో రోహిత్ ను ఎక్కువగా ఇబ్బందిపెట్టిన ట్రెంట్ బౌల్ట్ నే కివీస్ ఈసారి కూడా ప్రయోగిస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు.

గతంలో టీమిండియా-కివీస్ ల మధ్య జరిగిన మ్యాచుల్లో రోహిత్ బౌల్ట్ బౌలింగ్ లోనే నాలుగు సార్లు ఔటయ్యాడు. ముఖ్యంగా బౌల్ట్ విసిరే ఇన్ స్వింగర్లను ఎదుర్కోనడంలో రోహిత్ చాలాసార్లు ఇబ్బందిపడ్డాడు. అంతేకాకుండా మొత్తం  బౌల్ట్ బౌలింగ్ లో 24 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసిన రోహిత్ కేవలం 88 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో మరోసారి కివీస్  రోహిత్ జోరును అడ్డుకునేందుకు ఈ  లెఫ్టార్మ్ స్పిన్నర్ ను ఉపయోగించే  అవకాశాలే ఎక్కువగా వున్నాయి. 

అయితే గతంలో రోహిత్ శర్మ  అంతగా పామ్ లో లేని సమయంలో బౌల్ట్ జోరు కొనసాగింది. కానీ ప్రస్తుతం ప్రపంచ కప్ టోర్నీలో అతడి జోరు చూస్తుంటే ఎంతటి ప్రపంచ స్థాయి బౌలర్లనయినా చిత్తు చేయడానికి సిద్దంగా వున్నాడు. లీగ్ దశలోనే ఈ స్థాయిలో చెలరేగిన అతడు కీలకమైన సెమీస్ లో మరెంత  జాగ్రత్తగా ఆడతాడో ఊహించవచ్చు, మరీముఖ్యంగా తనను ఇబ్బంది పెట్టే బౌల్ట్ వంటి బౌలర్లను ఆచి తూచి ఎదుర్కొంటాడు. కాబట్టి గత సెంటిమెంట్  లు ఈ మ్యాచ్ లో పనిచేయకపోవచ్చు.  

click me!