మహారాష్ట్రకు వెళ్లు: వరుణదేవుడికి కేదార్ జాదవ్ ప్రార్థనలు

By telugu teamFirst Published Jun 14, 2019, 8:38 AM IST
Highlights

ఆట చూడడానికి వచ్చినవారంతా  గొడుగులు పట్టుకుని నిలబడ్డారు. వానదేవుడు కరుణించి ఆట ప్రారంభమవుతుందేమోనని ఆశగా వేచి చూశాడు. అయితే, వారికి నిరాశ తప్పలేదు. ఈ స్థితిలో కేదార్ జాదవ్ పెట్టిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. 

నాటింగ్‌హామ్: వర్షం న్యూజిలాండ్, భారత్ మ్యాచుకు ఆటంకంగా మారుతున్న సమయంలో టీమిండియా ఆటగాడు కేదార్ జాదవ్ వరుణదేవుడిని వింత కోరిక కోరాడు. మహరాష్ట్రకు వెళ్లాల్సిందిగా అతను వానదేవుడిని ప్రార్థించాడు. న్యూజిలాండ్, భారత్ మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. దాంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 

ఆట చూడడానికి వచ్చినవారంతా  గొడుగులు పట్టుకుని నిలబడ్డారు. వానదేవుడు కరుణించి ఆట ప్రారంభమవుతుందేమోనని ఆశగా వేచి చూశాడు. అయితే, వారికి నిరాశ తప్పలేదు. ఈ స్థితిలో కేదార్ జాదవ్ పెట్టిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. 

టింగ్‌హామ్‌లో కుండపోతగా కురుస్తూ ఆటను చెడగొట్టే బదులు... కరువుతో అల్లాడుతున్న మహారాష్ట్రకు తరలివెళ్లాలని జాదవ్ వానదేవుడిని ప్రార్థించాడు. మైదానంలో నిలబడి, చేతులు కట్టుకుని తన మాతృభాష మరాఠీలో వానదేవుడికి అతడు మొక్కుతున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.
  
కేదార్ జాదవ్ సొంత రాష్ట్రం మహారాష్ట్రలో ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం 7 శాతం మాత్రమే నీరు అందుబాటులో ఉండడంతో ప్రజాజీవనంపై తీవ్ర ప్రభావం పడుతోంది. మహారాష్ట్రతో పాటు ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 

click me!