టీమిండియాతో మ్యాచ్... మాకు కలిసొచ్చే అంశమదే: పాక్ ఓపెనర్ ఇమామ్

By Arun Kumar PFirst Published Jun 13, 2019, 9:06 PM IST
Highlights

ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో మొత్తం మ్యాచుల కంటే ఒకే ఒక మ్యాచ్  పై  ఎక్కువగా చర్చ జరుగుతోంది. అదే ఇండో పాక్ మ్యాచ్. దాయాది దేశాల మధ్య ఈ నెల 16 న జరగనున్న ఈ పోరుకు ఇప్పటికే చాలా హైప్ క్రియేటయ్యింది. అంతేకాకుండా మీడియా కూడా ఈ మ్యాచ్ కు ప్రత్యేకంగా ప్రచారం కల్పించడంతో ప్రపంచ దేశాలు కూడా దీనికోసం ఎదురుచూస్తున్నాయి. ఇక భారత్, పాకిస్థాన్ ల విషయాన్ని  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వతహాగా క్రికెట్ అంటే ఇష్టపడే ఇరు దేశాల అభిమానులు ఇక ఇండో పాక్ మ్యాచ్ అంటే పడిచస్తారు. 

అయితే ఈ మ్యాచ్ పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ ను ఎంతో ఒత్తిడికి గురిచేస్తుందట. ఇప్పటికే రెండు  మ్యాచుల్లో ఓటమిపాలైన పాక్ కు ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ కీలకమేనని...అందులోనూ భారత్ తో జరిగే మ్యాచ్ మరింత స్పెషల్ అని ఇమామ్ పేర్కొన్నాడు. కాబట్టి ఈ ప్రపంచ కప్ లో నిలవాలన్నా, తమ అభిమానులు గర్వించేలా చేయాలన్నా టీమిండియాపై గెలుపొక్కటే మార్గమని అన్నాడు. 

ఇక మాంచెస్టర్ లో జరిగే ఈ మ్యాచ్ లో పాక్ అభిమానులు ఎక్కువగా పాల్గోనే అవకాశముంది. కాబట్టి మైదానంలో అభిమానుల సపోర్ట్ తమకు ఎక్కువగా వుంటుందని...ఇది తమకు కలిసివస్తుందన్నాడు. ఈ మ్యాచ్ కోసం తానెంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు ఇమామ్ పేర్కొన్నాడు.  
 
click me!