ఐసిసి ప్రపంచ కప్: తుడిచిపెట్టుకుపోయిన పాకిస్తాన్ Vs శ్రీలంక మ్యాచ్...వర్షం కారణంగా రద్దు

By Arun Kumar PFirst Published Jun 7, 2019, 3:12 PM IST
Highlights

ప్రపంచ కప్ లో  భాగంగా శుక్రవారం ఉపఖండం జట్ల మధ్య జరిగాల్సిన మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా నిలిచింది. ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుపై అద్బుత విజయాన్ని అందుకున్న పాకిస్తాన్,  అప్ఘాన్ పై గెలిచి ఈ టోర్నీలో విజయాల బోణీ  కొట్టిన  శ్రీలంకల మధ్య ఈ మ్యాచ్ జరగాల్సి వుంది. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు నుండే బ్రిస్టల్ లో జోరున వర్షం కురుస్తుండటంతో ఇంకా టాస్ కూడా పూర్తికాలేదు. 

ప్రపంచ కప్ లో  భాగంగా శుక్రవారం ఉపఖండం జట్ల మధ్య జరిగాల్సిన మ్యాచ్ కు వర్షం కారణంగా రద్దయింది. బ్రిస్టల్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో మ్యాచ్ ను కొనసాగించడం కష్టమని భావించిన అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నాట్లు ప్రకటించింది. దీంతో పాక్, లంకలు చెరో పాయింట్ పంచుకోవాల్సి వస్తోంది.

 ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుపై అద్బుత విజయాన్ని అందుకున్న పాకిస్తాన్,  అప్ఘాన్ పై గెలిచి ఈ టోర్నీలో విజయాల బోణీ  కొట్టిన  శ్రీలంకల మధ్య ఈ మ్యాచ్ జరగాల్సి వుంది. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు నుండే బ్రిస్టల్ లో జోరున వర్షం కురుస్తుండటంతో ఇంకా టాస్ కూడా పూర్తికాలేదు. 

ఈ  టోర్నీలో వెస్టిండిస్ చేతిలో ఘోర ఓటమిని  చవిచూసి తీవ్ర విమర్శలపాలైన పాక్ తొందరగానే తిరిగి పుంజుకుంది. గత మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ ను ఓడించి విమర్శలు చేసిన వారి నోటి నుండే ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా ఆ మ్యాచ్ ద్వారా ఆటగాళ్లు కూడా మంచి ఫామ్ కనబర్చారు. అదే ఊపును శ్రీలంకపై కూడా కొనసాగించి విజయ పరంపర కొనసాగించాలని పాక్ భావిస్తోంది. 

ఇక ఈ ప్రపంచ కప్ లో శ్రీలంక ప్రయాణం కూడా ఇంచుమించు పాక్ మాదిరిగానే సాగుతోంది. మొదటి మ్యాచ్ లోనే న్యూజిలాండ్ చేతిలో ఓటమిని చవిచూసిన లంక ఆ తర్వాత అప్ఘాన్ పై విజయాన్ని  అందుకుంది. అలాగే ఆ మ్యాచ్ లో పాక్ ను ఓడించిత తమ పూర్వవైభవాన్ని చాటుకోవాలని శ్రీలంక భావిస్తోంది. ఇలా ఇరుజట్లు గెలుపును సీరియస్ గా తీసుకోవడంతో ఈ మ్యాచ్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. 


 

click me!