ఐసిసి ప్రపంచ కప్: శ్రీలంక ఘన విజయం...స్వల్ఫ లక్ష్యఛేదనలో చతికిలబడ్డ అప్ఘాన్

By Arun Kumar PFirst Published Jun 4, 2019, 2:53 PM IST
Highlights

187 పరుగుల స్వల్ఫ లక్ష్యాన్ని ఛేదించడంలో చతికిలబడ్డ అప్ఘాన్ ప్రపంచ కప్ టోర్నీలో గెలుపు బోణీ కొట్టు అవకాశాన్ని కోల్పోయింది. అప్ఘాన్ బ్యాట్ మెన్స్ ఒకరిద్దరు మిగతా వారంతా కేవలం సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. కాపాడుకోవాాల్సిన పరుగులు తక్కువే అయినా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంలో లంక బౌలర్లు సఫలమయ్యారు. దాని ఫలితమే ఈ విజయం.

187 పరుగుల స్వల్ఫ లక్ష్యాన్ని ఛేదించడంలో చతికిలబడ్డ అప్ఘాన్ ప్రపంచ కప్ టోర్నీలో గెలుపు బోణీ కొట్టు అవకాశాన్ని కోల్పోయింది. అప్ఘాన్ బ్యాట్ మెన్స్ ఒకరిద్దరు మిగతా వారంతా కేవలం సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. కాపాడుకోవాాల్సిన పరుగులు తక్కువే అయినా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంలో లంక బౌలర్లు సఫలమయ్యారు. దాని ఫలితమే ఈ విజయం.

లంక బౌలర్లలో మలింగ 3, ప్రదీప్ 4, ఉదానా 1, పెరెరా 1 వికెట్ పడగొట్టారు. వీరి బౌలింగ్ దాటికి పసికూన అప్ఘాన్ నిలవలేకపోయింది. అయితే ఓపెనరర్ హజ్రతుల్లా 30, చివర్లో నజీబుల్లా జద్రాన్ 43 పరుగులతో ఆకట్టుకోవడంతో అప్ఘాన్ ఈమాత్రమైనా ఫోటీ ఇవ్వగలిగింది. 

 అప్ఘాన్ కెప్టెన్ గుల్బదిన్ నైబ్, జద్రాన్ లు కలిసి కాస్సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుని గెలుపుపై ఆశలు రేకెత్తించారు. అయితే 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ప్రదీప్ బౌలింగ్ లో నైబ్ వికెట్ల ముందు చిక్కి ఎల్బీగా ఔటయ్యాడు. దీంతో అప్ఘాన్ 121 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోవడంతో ఓటమిని ఖాయం చేసుకుంది. చివర్లో జద్రాన్ ఒక్కడే ఒంటరిపోరాటం చేసినా ఫలితం లేకుండాపోయింది.

శ్రీలంకను తక్కువ పరుగులకే కట్టడి చేసి అప్ఘాన్ బౌలర్లు గెలుపుకు బాటలు వేయగా బ్యాట్ మెన్స్ తడబాటుతో ఆ జట్టు అడుగులు లక్ష్యం దిశగా పడటం లేదు. కేవలం 57 పరుగులలకే కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయి  ఆ జట్టు ఓటమి అంచుల్లోకి జారుకుంది. ఓపెనర్ హజ్మతుల్లా ఒక్కడే 30 పరుగులతో పరవాలేదనిపించాడు. మిగతా బ్యాట్ మెన్ప్ ఎవ్వరూ రెండంకెల స్కోరును  కూడా సాధించకుండానే పెవిలియన్ కు చేరారు.  

187 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన అప్ఘాన్ ఓపెనర్ షహజాద్ ఔటవడంతో వికెట్ల పతనం మొదలయ్యింది. మలింగ అతడిని పెవిలియన్ కు పంపించాడు. దీంతో అప్ఘాన్ 36 పరుగులకే వికెట్ కోల్పోయింది. 

వర్షం కారణంగా  దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోయిన మ్యాచ్ ఎట్టకేలకు ప్రారంభయ్యింది. మిగతా రెండు వికెట్లను పడగొట్టిన అప్ఘాన్ బౌలర్లు లంకను 201 పరుగులకే ఆలౌట్ చేశారు. అయితే వర్షం కారణంగా చాలా సమయం వృధా కావడంతో మ్యాచ్ ను 41 ఓవర్లకు కుదించి అప్ఘాన్ విజయలక్ష్యాన్ని 187 పరుగులుగా నిర్ణయించారు. 

 శ్రీలంక జట్టు కూడా అప్ఘాన్ బౌలర్ దాటికి తట్టుకోలేకపోతోంది. వరుసగా వికెట్లు కోల్పోతూ లంక బ్యాట్ మెన్స్ కనీస పోరాటాన్ని కూడా చేయలేకపోయారు.  దీంతో 144 పరుగుల  వద్ద కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన శ్రీలంక మరో 40 పరుగులలోపే ఆరు వికెట్లు కోల్పోయింది. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న కుశాల్ పెరీరా కూడా రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఔటయ్యాడు.  

అప్ఘాన్  తో మ్యాచ్ లో శ్రీలంక ఓపెనర్లు రాణించి గట్టి పునాది వేసినప్పటికి జట్టు సభ్యులు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఓపెనర్లు ఔటైన తర్వాత వరుసగా వికెట్లను కోల్పోతూ పరుగులు సాధించడంతో బ్యాట్ మెన్స్ అందరూ విఫలమయ్యారు. 91 పరుగుల వద్ద  కేవలం ఒక్క వికెట్ కోల్పోయి పటిష్ట  స్థితిలో నిలిచిన లంక ప్రస్తుతం 159 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. కుశాల్ పెరీరా( 78 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించగలిగాడు. 

శ్రీలంక జట్టుకు అప్ఘాన్ బౌలర్ నబీ  గట్టి షాకిచ్చాడు. అతడు ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి లంక టాప్ ఆర్డర్ ను ఒత్తిడిలోకి నెట్టాడు. మొదట క్రీజులో కుదురుకున్న తిరుమన్నే(25 పరుగులు)ను ఓ అద్భుత బంతితో పెవిలియన్ కు పంపించాడు. అదే ఓవర్లో మెండిస్ ( 2 పరుగులు) చేసి ఔటయవగా, మాథ్యూస్ డకౌటయ్యారు.  

అప్ఘాన బౌలర్లపై విరుచుకుపడుతూ సెంచరీ భాగస్వామ్యం నమోదుచేసేలా కనిపించిన లంక ఓపెనర్లను ఎట్టకేలకు విడిపోయారు. కెప్టెన్ కరుణరత్నే(30 పరుగులు)  మహ్మద్ నబీ బౌలింగ్ లో  ఔటవడంతో ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది.  ఇలా 92 పరుగుల వద్ద లంక మొదటి వికెట్ ను కోల్పోయింది. 

ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటికే ఒక్కో ఓటమిని చవిచూసి విజయం కోసం తహతహలాడుతున్న ఉపఖండం జట్లురెండు కార్డిఫ్ వేదికగా తలపడనున్నాయి. ఆస్ట్రేలియాకు మంచి పోటీ ఇచ్చి ఓటమిపాలైన అప్ఘాన్... న్యూజిలాండ్ చేతితో ఘోర ఓటమిని చవిచూసిన శ్రీలంక జట్లు మరికొద్దిసేపట్లో తలపడనున్నాయి. 

ఈ మ్యాచ్ కోసం కొద్దిసేపటిక్రితమే నిర్వహించిన టాస్ గెలిచిన అప్ఘాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ కు దిగింది. ఈ మ్యాచ్ లో అప్ఘాన్  గత మ్యాచ్ లో ఆడిన ఆటగాళ్లందరికి కొనసాగించగా శ్రీలంక జట్టులో మాత్రం ఓ మార్పు చోటుచేసుుకుంది. జీవన్ మెండిస్ స్ధానంలో ప్రదీప్ లంక జట్టులో చేరాడు.  

తుది జట్లు:

అప్ఘాన్ టీం:
 
మహ్మద్ షజాద్, హజ్రతుల్లా జజాయి, రహమత్ షా, హష్మతుల్లా షహిదీ, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్ (కెప్టెన్), రషీద్ ఖాన్, ముజీబ్ రహ్మాన్, హమీద్ హసన్, దవ్లత్ జద్రాన్
 
శ్రీలంక టీం:

దిముత్ కరుణరత్నే(కెప్టెన్), తిరుమన్నె, కుశాల్ పెరీర(వికెట్ కీపర్), కుశాల్ మెండిస్, ఆంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, థిసారా పెరీరా, ఇసురు ఉదన, సురంగ లక్మల్, లసిత్ మలింగ, నువాన్ ప్రదీప్

click me!