సెమీ ఫైనల్లో కివీస్ పై భారత్ ఓటమికి కారణాలివే...

By telugu teamFirst Published Jul 11, 2019, 12:08 PM IST
Highlights

సిరీస్ మొత్తం అద్భుతంగా ఆడిన ఇండియా సెమీ ఫైనల్ లో చతికిలపడడం భారత క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది. పాయింట్ల పట్టికలో అగ్రభాగాన నిలిచినప్పటికీ ఫైనల్ అవకాశాలను చేజార్చుకుది. 

లండన్: హాట్ ఫేవరైట్ గా ప్రపంచ కప్ బరిలోకి దిగిన టీమిండియా సెమీ ఫైనల్ నుంచే వెనుదిరిగింది. సెమీ ఫైనల్ మ్యాచులో ఇండియా న్యూజిలాండ్ పై 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రవీంద్ర జడేజా అద్భుతమైన ఇన్నింగ్సు వృధా అయింది. 

సిరీస్ మొత్తం అద్భుతంగా ఆడిన ఇండియా సెమీ ఫైనల్ లో చతికిలపడడం భారత క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది. పాయింట్ల పట్టికలో అగ్రభాగాన నిలిచినప్పటికీ ఫైనల్ అవకాశాలను చేజార్చుకుది. సెమీ ఫైనల్ లో భారత్ ఓటమికి కారణాలను ఇలా చెప్పవచ్చు.

కుప్పకూలిన టాప్ ఆర్డర్: న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత టాప్ ఆర్డర్ కుప్పకూలింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ల విసిరిన బంతుల స్వింగ్ ను ఎదుర్కోవడంలో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. దాంతో ఐదు పరుగులకే ప్రధానమైన మూడు వికెట్లను కోల్పోయింది. 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ తీవ్రమైన నిరాశకు గురి చేశారు. 

కివీస్ ఫీల్డింగ్ అద్భుతం: న్యూజిలాండ్ ఆటగాళ్లు అద్భుతమైన ఫీల్డింగ్ తో భారత బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి పెంచారు. లీగ్ దశలో రోహిత్ శర్మకు నాలుగు సార్లు లైఫ్ లభించింది. ఈసారి కివీస్ వికెట్ కీపర్ లాథమ్ ఏ మాత్రం తప్పు చేయలేదు. నీషం బౌలింగులో లాథమ్ కెఎల్ రాహుల్, దినేష్ కార్తిక్ క్యాచ్ ల ద్వారా వెనక్కి పంపాడు. మ్యాచును పూర్తిగా కివీస్ చేతుల్లో పెట్టింది ధోనీ రన్నవుట్. మార్టిన్ గుప్తిల్ విసిరిన బంతి నేరుగా వికెట్లను తాకడంతో ధోనీ (50) పెవిలియన్ కు చేరుకున్నాడు. 

షాట్ సెలెక్షన్లలో తప్పిదాలు: మిచెల్ సాంత్నర్ బౌలింగును రిషబ్ పంత్ (32), హార్దిక్ పాండ్యా (32) ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. షాట్ సెలెక్షన్లు సరిగా లేక వారు పెవిలియన్ చేరుకోవాల్సి వచ్చింది. 

ఛేదనపై ఆలస్యంగా దృష్టి: రవీంద్ర జడేజా (77), ధోనీ (50) ఏడో వికెట్ కు 116 రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, చివరి 3 ఓవర్లలో 37 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్ పడింది. దీంతో ఒత్తిడి తీవ్రమైంది. జోరు పెంచడంలో చేసిన ఆలస్యం వల్ల వారిద్దరు కూడా చివరలో ఒత్తిడికి గురి కావాల్సి వచ్చింది. 

click me!