బూట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు... జింబాబ్వే క్రికెటర్ ట్వీట్, వెంటనే స్పందించిన పూమా...

Published : May 23, 2021, 04:56 PM IST
బూట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు... జింబాబ్వే క్రికెటర్ ట్వీట్, వెంటనే స్పందించిన పూమా...

సారాంశం

ప్రతీ సిరీస్ అయిపోయిన తర్వాత బూట్లకు గ్లవ్ పెట్టలేకపోతున్నా.... దయచేసి ఎవరైనా స్పాన్సర్‌ ఉంటే చెప్పండి... సాయం కోరుతూ జింబాబ్వే క్రికెటర్ రియాన్ బర్ల్ ట్వీట్... వెంటనే స్పందించిన పూమా సంస్థ...

అంతర్జాతీయ క్రికెటర్లు అంటే కోట్లల్లో వేతనాలు, లగ్జరీ లైఫ్ ఉంటుందనుకుంటే పొరపాటే. అలాంటి లగ్జరీలు, కోట్లల్లో వేతనాలు కొన్ని దేశాల క్రికెటర్లకే పరిమితం. జింబాబ్వే క్రికెటర్లకు బూట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ, ఓ స్పాన్సర్‌ను వెతికిపట్టడంటూ వేడుకున్నాడు జింబాబ్వే క్రికెటర్ రియాన్ బర్ల్... ‘ప్రతీ సిరీస్ ముగిసిన తర్వాత బూట్లకి గ్లూవ్ పెట్టుకోలేకపోతాం... ఎవరైనా స్పాన్సర్‌ దొరికే అవకాశం ఉందా...’ అంటూ బూట్లకు గమ్ పెడుతున్న ఫోటోను పోస్టు చేశాడు క్రికెటర్ రియాన్ బర్ల్. జింబాబ్వే క్రికెటర్ ట్వీట్‌‌కి క్రికెట్ ఫ్యాన్స్ కదిలారు.

మనోడి పరిస్థితిని క్రికెట్ ప్రపంచానికి తెలిసేలా రీట్వీట్లు, పోస్టులు చేశారు. దీంతో వెంటనే స్పందించిన ప్రముఖ స్పోర్ట్స్ షూస్ కంపెనీ పూమా... ‘ఇక ఆ గ్లూని పక్కన పారేయ్... మేం నిన్ను కవర్ చేస్తాం’ అంటూ సమాధానం ఇచ్చింది.

షూస్ స్పాన్సర్ చేసేందుకు పూమా ముందుకు రావడంతో సంతోషాన్ని వ్యక్తం చేసిన రియాన్... ‘పూమా టీమ్‌కి కలవడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. థ్యాంక్యూ సో మచ్’ అంటూ రిప్లై ఇచ్చాడు.

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది