నీది బ్యాడ్‌లక్ కాదు, బద్ధకం! ఆ చిన్న తప్పు చేయకుంటే... హర్మన్‌ప్రీత్ రనౌట్‌పై అలీసా హీలి...

By Chinthakindhi RamuFirst Published Feb 26, 2023, 4:03 PM IST
Highlights

ఆమె కరెక్టుగా ప్రయత్నించి క్రీజు దాటేసి ఉండేది... హర్మన్‌ప్రీత్ కౌర్ అలసత్వాన్ని మేం వాడుకున్నాం... అన్నింటినీ బ్యాడ్ లక్ అనుకుంటే బాగుపడలేం... ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలీసా హీలి.. 

రికార్డు స్థాయిలో ఏడో సారి ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కి అర్హత సాధించింది ఆస్ట్రేలియా.  ఐదు సార్లు పొట్టి ప్రపంచకప్ టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా, 2023 టీ20 వరల్డ్ కప్‌ సెమీస్‌పై టీమిండియాపై 5 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది...

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2020 టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో 85 పరుగుల తేడాతో టీమిండియాని ఓడించిన ఆసీస్, 2023 టోర్నీలోనూ భారత జట్టుపై పైచేయి సాధించింది. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాకి గట్టి పోటీ ఇచ్చిన టీమిండియా... ఫీల్డింగ్ విషయంలో మాత్రం తేలిపోయింది.

Latest Videos

ఫీల్డింగ్‌లో టీమిండియా చేసిన తప్పులు, ఆస్ట్రేలియాకి బాగా ఉపయోగపడ్డాయి. అదీకాకుండా కీలక సమయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌట్ కావడంతో ఆ తర్వాత వరుస వికెట్లు తీసి... మరోసారి టీమిండియాపై గెలిచేసింది ఆస్ట్రేలియా...

సెమీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత తన రనౌట్ గురించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది హర్మన్‌ప్రీత్ కౌర్. ‘ఇంత కంటే దరిద్రం ఇంకేటి ఉండదనుకుంటా...’ అని తన బ్యాడ్‌లక్‌కి కన్నీళ్లు పెట్టుకుంది...  ఈ కామెంట్లపై తాజాగా స్పందించింది ఆసీస్ వికెట్ కీపర్ అలీసా హీలి..

‘అందులో బ్యాడ్‌లక్ కంటే ఎక్కువగా బద్ధకమే కనిపిస్తోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇలా జరిగింది? అలా జరిగిందని చాలా చెప్పుకోవచ్చు. కానీ ఆమె కరెక్టుగా ప్రయత్నించి క్రీజు దాటేసి ఉండేది... ఎక్స్‌ట్రా రెండు మీటర్లు దాటడానికి కరెక్టుగా ప్రయత్నించి ఉంటే.. ఫలితం వేరేగా ఉండేదేమో...

ఆమె చూపించిన అలసత్వాన్ని మేం వాడుకున్నాం. నీ జీవితంలో జరిగిన ప్రతీదానికి దరిద్రం అని, బ్యాడ్‌లక్ అని చెప్పుకోవచ్చు కానీ ఆ సమయంలో మనం ఎంతలా ప్రయత్నిస్తున్నాం, గెలవడానికి ఎంత వరకూ కష్టపడుతున్నామనేది ముఖ్యం...

ఫీల్డ్‌లో దిగిన తర్వాత పూర్తి ఎనర్జీ వాడాలి, పూర్తి ఎఫర్ట్స్ పెట్టాలి. ఆమె అవుట్ కాకుండా ఉండాలనుకుంటే బాల్ వస్తున్న విషయం గమనించి ఉన్నప్పుడు డైవ్ చేసి ఉండొచ్చు. అయితే ఈజీగా దాటేస్తానని అనుకుని రిలాక్స్ అయిపోయింది. ఆ చిన్న మిస్టేక్‌ని మేం వాడుకున్నాం. వికెట్ల మధ్య పరుగెత్తేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...

చిన్న చిన్న తప్పులు చేస్తే, వాటిని ప్రత్యర్థులు వాడుకుంటారనే అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఇలాంటి పెద్ద టోర్నీలు గెలవాలనుకుంటే ఎలాంటి తప్పు చేయకూడదు. ఈ విషయంలో మేం ఇప్పటిదాకా బాగానే చేస్తున్నాం...

వాస్తవానికి ఇలాంటి సందర్భాల్లో నేను బెయిల్స్‌ని కొట్టను. ఎందుకంటే వాటిని పడేయడం, మళ్లీ పెట్టడం టైమ్ వేస్ట్ ఎందుకుని అనుకుంటా...  కానీ ఆ సమయంలో ఎందుకు హర్మన్‌ప్రీత్ అలసత్వాన్ని గమనించి, బెయిల్స్‌ని తీసేశాను.. అందుకే బెలిందా క్లార్క్ నాకు ఈ విషయంలో థ్యాంక్స్ చెబుతూ మెసేజ్ చేసింది... ’ అంటూ చెప్పుకొచ్చింది ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలీసా హీలి...

వరుసగా ఏడోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా మహిళా జట్టు, తొలిసారి ఫైనల్ చేరిన సౌతాఫ్రికాతో నేడు (ఆదివారం ఫిబ్రవరి 26న) ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. 

click me!