ముంబైకి ఎదురుందా..? యూపీతో మ్యాచ్‌లోనూ టాస్ ఓడిన హర్మన్‌ప్రీత్

Published : Mar 18, 2023, 03:03 PM ISTUpdated : Mar 18, 2023, 03:10 PM IST
ముంబైకి ఎదురుందా..? యూపీతో మ్యాచ్‌లోనూ టాస్ ఓడిన హర్మన్‌ప్రీత్

సారాంశం

WPL: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ లో  వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్ తో నేడు యూపీ వారియర్స్ పోటీ పడుతున్నది. 

ఆడిన ఐదు మ్యాచ్ లకు గాను ఐదింటిలోనూ గెలిచి జోరు మీదున్న ముంబై ఇండియన్స్.. నేడు  యూపీ వారియర్స్ తో ఆడనున్నది. ఇదివరకే ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకున్న ముంబై.. నేటి మ్యాచ్ లోనూ గెలిచి జోరు కొనసాగించాలని భావిస్తునండగా  గత మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో చావుదెబ్బ తిన్న యూపీ.. నేడు గెలిచి  ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని  కోరుకుంటున్నది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగనున్నది.  

డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న   నేటి మ్యాచ్ లో అలీస్సా హీలీ  సారథ్యంలోని   యూపీ వారియర్స్  టాస్ గెలిచి తొలుత బౌలింగ్  చేయనుంది. ముంబై ఇండియన్స్ కు రానుంది.  ఈ లీగ్ లో ఆరు మ్యాచ్ లకు గాను ఆరింటిలోనూ హర్మన్ టాస్ ఓడటం గమనార్హం. 

ప్రత్యర్థి ఎవరన్నది సంబంధం లేకుండా.. టాస్ తో పనిలేకుండా బరిలోకి దిగితే  అపోజిషన్ టీమ్ లకు బ్యాండ్ వాయిస్తున్న  ముంబైకు ఎదురేలేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్ని విభాగాల్లో ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శనలతో దూసుకుపోతున్నది.  మరోవైపు యూపీ మాత్రం బ్యాటింగ్ చేసే సమయంలో కీలక  సమయంలో వికెట్లు కోల్పోతూ  విఫలమవుతున్నది.   మరి నేటి మ్యాచ్ లో  కూడా అదే పునరావృతమైతే ఆ జట్టు ప్లేఆఫ్ ఆశలు మరింత సంక్లిష్టమవుతాయి.

 

తుది జట్లు : ఈ మ్యాచ్ కోసం   యూపీ టీమ్  పర్శవి చోప్రా అరంగేట్రం చేసింది.  ముంబై జట్టులో మార్పులేమీ లేవు. గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే హర్మన్ సేన బరిలోకి దిగబోతున్నది. 

యూపీ : అలీస్సా హేలీ(కెప్టెన్),  దేవికా వైద్య, కిరణ్ నవ్‌గిరె, తహిలా మెక్‌గ్రాత్, గ్రేస్ హరీస్, సిమ్రాన్ షేక్, దీప్తి శర్మ, పర్శవి చోప్రా, సోఫీ ఎకిల్‌స్టోన్, అంజలి శర్వని, రాజేశ్వరి గైక్వాడ్ 

ముంబై : యస్తికా భాటియా,  హేలీ మాథ్యూస్, నటాలి సీవర్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్),  అమెలియా కెర్, ఇస్సీ వాంగ్, హుమైరా కాజి, ధారా గుజ్జర్, అమన్‌జ్యోత్ కౌర్, జింతమణి కలిత, సైకా ఇషాక్ 

 

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?