
భారత సీనియర్ బ్యాటర్, వన్డే, టెస్టు కెప్టెన్ మిథాలీ రాజ్... వన్డే వరల్డ్ కప్ 2022 తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటుందని ప్రచారం జరిగింది. అయితే మిథాలీ రాజ్ మాత్రం 39 ఏళ్ల వయసులోనూ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగడానికి ఇష్టపడుతోంది...
అయితే తాజాగా వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌కి ప్రకటించిన జట్లలో మాత్రం సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్‌కి చోటు దక్కలేదు. గత మూడు సీజన్లలో వెలాసిటీ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించింది మిథాలీ రాజ్. మిథాలీ గైర్హజరీతో వెలాసిటీకి ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కెప్టెన్‌గా వ్యవహరించబోతోంది...
మిథాలీ రాజ్‌తో పాటు భారత సీనియర్ పేసర్ జులన్ గోస్వామి కూడా వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ ఇద్దరితో పాటు మరో ఆల్‌రౌండర్ శిఖా పాండే కూడా ఈ టోర్నీకి దూరంగా ఉండనుంది...
మహిళా ఐపీఎల్‌గా భావించే వుమెన్స్ టీ20 ఛాలెంజ్, ఇప్పటిదాకా మూడు సీజన్లు నడిచింది. మొదటి రెండు సీజన్లలో సూపర్ నోవాస్ జట్టు టైటిల్ గెలవగా, 2020 సీజన్‌లో ట్రెయిల్‌బ్లేజర్స్ తొలిసారి టైటిల్ గెలిచింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా గత సీజన్‌లో వుమెన్స్ టీ20 ఛాలెంజ్ టోర్నీని నిర్వహించలేదు బీసీసీఐ..
మూడు ఫ్రాంఛైజీలు పాల్గొనే వుమెన్స్ టీ20 ఛాలెంజ్ రిజల్ట్ నాలుగు మ్యాచుల్లో తేలిపోతుంది. మే 23న ట్రైయిల్‌బ్లేజర్స్, సూపర్ నోవాస్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. మే 24న సూపర్ నోవాస్ జట్టు, వెలాసిటీతో తలబడుతుంది. మే 26న వెలాసిటీ, ట్రైయిల్‌బ్లేజర్స్ మధ్య ఆఖరి గ్రూప్ మ్యాచ్ జరుగుతుంది. పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్న జట్లు ఫైనల్‌కి చేరతాయి. ఒక వేళ మూడు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి, ఒక్కో మ్యాచ్ ఓడితే... నెట్ రన్ రేట్ ఆధారంగా ఫైనల్ చేరే జట్లను డిసైడ్ చేస్తారు...
పురుషుల ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ (మే 29)కి ఒక్క రోజు ముందు అంటే మే 28న వుడెన్స్ టీ20 ఛాలెంజ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది...
హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించే సూపర్ నోవాస్ టీమ్ ఇది: హర్మన్‌ప్రీత్ కౌర్, తానియా భాటియా, అలెనా కింగ్, ఆయుష్ సోనీ, చందు వీ, డియాండ్రా డాటిన్, హర్లీన్ డియోల్, మేఘనా సింగ్, మోనికా పటేల్, ముస్కక్ మాలిక్, పూజా వస్త్రాకర్, ప్రియా పూనియా, రాశి కనోజియా, సోఫియా ఎక్లేస్టోన్, సునీ లూజ్, మన్సీ జోషి
స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించే ట్రైయిల్‌బ్లేజర్స్ జట్టు ఇది: స్మృతి మంధాన, పూనమ్ యాదవ్, అరుంధతి రెడ్డి, హేలీ మాథ్యూస్, జెమీమా రోడ్రిగ్స్, ప్రియాంక ప్రియదర్శిని, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్, రిచా ఘోష్, ఎస్ మేఘనా, సైకా ఇషాకీ, సల్మా ఖటూన్, షర్మీన్ అక్తర్, సోఫియా బ్రౌన్, సుజతా మాలిక్, ఎస్‌బీ పోకవర్
దీప్తి శర్మ కెప్టెన్‌గా వ్యవహరించే వెలాసిటీ జట్టు ఇది: దీప్తి శర్మ, స్నేహ్ రాణా, షెఫాలీ వర్మ, అయబొంగ ఖాక, కేపీ నవ్‌గేర్, కేథరిన్ క్రాస్, కీర్తి జేమ్స్, లౌరా వాల్వార్ట్, మయ సోనవేన్, నాథకన్ చాంతమ్, రాధా యాదవ్, ఆర్తీ కేదర్, శివాలి షిండే, సిమ్రన్ బహదూర్, యషికా భాటియా, ప్రణవి చంద్ర