Hat-trick wickets: బంగ్లాదేశ్‌లో పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రస్తుతం టీ20 సిరీస్ ఆడుతోంది. రెండో టీ20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ బౌలింగ్ సంచలనం ఫరీహా త్రిస్నా హ్యాట్రిక్ తో అదరగొట్టింది.
Fariha Trisna hat-trick wickets : బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ ఫరీహా త్రిస్నా తన కెరీర్‌లో రెండో హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించింది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం మిర్పూర్‌లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లు రెండో టీ20లో తలపడ్డాయి. బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత ఆస్ట్రేలియా ముందుగా ఫోబ్ లిచ్‌ఫీల్డ్‌ను కోల్పోయింది, అయితే గ్రేస్ హారిస్, జార్జియా వేర్‌హామ్ 91 పరుగులు జోడించి జట్టును భారీ స్కోరును అందించారు. దీంతో బంగ్లాదేశ్‌ను 58 పరుగుల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది.
షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బౌలింగ్ సంచలనం ఫరీహా త్రిస్నా తన కెరీర్‌లో రెండో హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించింది. గతేడాది అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన త్రిస్నా అద్భుత బౌలింగ్ తో అదరగొడుతోంది. చివరి ఓవర్ లో చివరి మూడు బంతుల్లో వరుస వికెట్లు తీసి తన కెరీర్ లో రెండో హ్యాట్రిక్ ను నమోదుచేసింది. ఈ సంవత్సరం మహిళల క్రికెట్‌లో ఐదవ హ్యాట్రిక్ కావడం విశేషం. త్రిస్నా ఇన్నింగ్స్‌లోని చివరి మూడు బంతుల్లో పెర్రీ, సోఫీ మోలినక్స్, బెత్ మూనీలను పెవిలియన్ కు పంపింది. ఫరీహా త్రిస్నా తన వేసిన నాలుగు ఓవర్లలో 4/19 గణాంకాలు నమోదుచేసింది. ఇందులో ఒక మెడిన్ ఓవర్ కూడా ఉంది. 2022లో తన అరంగేట్రంలోనే ఫరీహా త్రిస్నా హ్యాట్రిక్ కూడా సాధించింది.
Hat-trick heroics from Fariha Trisna! Cleaning up the Aussie middle order 😎👏 pic.twitter.com/rKMc28bcSJ
— FanCode (@FanCode)ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ జార్జియా వేర్‌హామ్ కేవలం 30 బంతుల్లో 57 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు 161/8 పరుగులు అందించింది. అయితే, ఆసీస్ బౌలర్లు అదరగొట్టడంతో బంగ్లాదేశ్ 103/9 కే పరిమితం అయింది. ఆస్ట్రేలియా తరఫున సోఫీ మోలినిక్స్, ఆష్లీ గార్డనర్ చెరో మూడు వికెట్లు తీశారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0తో ఆధిక్యంలో ఉండగా, గురువారం అదే వేదికగా బంగ్లాదేశ్‌తో చివరిదైన మూడో టీ20లో తలపడనుంది.
బంగ్లాదేశ్ vs ఆస్ట్రేలియా 2వ టీ20 సంక్షిప్త స్కోర్లు :
ఆస్ట్రేలియా 161/8 (జార్జియా వేర్‌హామ్ 57, గ్రేస్ హారిస్ 47, ఫరీహా త్రిస్నా 4/19)
బంగ్లాదేశ్ 103/9 (దిలారా అక్టర్ 27, సోఫీ మోలినెక్స్ 3/10, ఆష్లీ గార్డనర్ 3/17).
TEAM INDIA : 100 కోట్ల భారతీయుల కల నిజమైన వేళ.. !