రవిశాస్త్రి ఏం చేశాడని మాట్లాడాలి..? గంగూలీ షాకింగ్ కామెంట్స్

By telugu teamFirst Published Oct 17, 2019, 1:03 PM IST
Highlights

అసలు గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి చేపడుతున్నాడు అనగానే... అందరి దృష్టి రవిశాస్త్రి మీదే పడింది. ఎందుకంటే వీరిద్దరికీ పడదని అందరి తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో ఓ విలేకరి.. టీం ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రితో మాట్లాడారా అంటూ గూంగూలీని ఓ ప్రశ్న వేశారు.

టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 23వ తేదీన గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు  చేపట్టున్నారు. ఈ నేపథ్యంలో టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి గురించి గంగూలీ చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

అసలు గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి చేపడుతున్నాడు అనగానే... అందరి దృష్టి రవిశాస్త్రి మీదే పడింది. ఎందుకంటే వీరిద్దరికీ పడదని అందరి తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో ఓ విలేకరి.. టీం ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రితో మాట్లాడారా అంటూ గూంగూలీని ఓ ప్రశ్న వేశారు.

ఈ ప్రశ్నకు ఆయన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. రవిశాస్త్రి ఏం చేశాడని నేను ఇప్పుడు మాట్లాడాలి? అని చెప్పి.. గంగూలీ పెద్దగా నవ్వేశాడు. స్పాంటినేయస్ గా... గంగూలీ చెప్పిన సమాధానం అందరి చేత నవ్వులు పూయించింది. గంగూలీ- రవిశాస్త్రి నడుమ ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి. ఇప్పుడు గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే... రవిశాస్త్రిని ఇబ్బందిపెట్టే అవకాశం ఉందనే వాదన కూడా వినపడుతోంది.

గతంలో.. రవిశాస్త్రి దాదాపై పలు విమర్శలు చేశారు.  2016లో అనిల్ కుంబ్లీ టీం ఇండియా కోచ్ కావడం వెనుక గూంగూలీ పాత్ర ఉందని... తనకు ఆ అవకాశం రాకుండా చేసింది అతనే అంటూ రవిశాస్త్రి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఏసీలో గంగూలీ ఒక సభ్యుడు కావడం వల్ల తనకు కోచ్ గా రాకుండా చేయడాని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా... గంగూలీ ధోనీ భవిష్యత్తు గురించి కూడా తాజాగా స్పందించారు.  భారత మాజీ కెప్టెన్ ధోనీ గురించి సెలక్టర్ల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ధోనీతో కూడా మాట్లాడతానని గంగూలీ చెప్పాడు. ఈ సమావేశంలో సెలక్టర్లతో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. కొన్ని నిబంధనల్లో మార్పులతో భారత జట్టు కోచ్ రవిశాస్త్రి అందుబాటులో ఉండకపోవచ్చని దాదా తెలిపాడు.

ఇదిలా ఉండగా... టీం ఇండియా ప్రదర్శన గురించి కూడా గంగూలీ స్పందించారు.  జట్టు ప్రదర్శన బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తూనే... ఐసీసీ టోర్నీలో జట్టు వైఫల్యాలను కూడా ఎత్తి చూపించాడు. ప్రతి టోర్నీ గెలవాలని కోరుకోలేం కానీ.. వరసగా ఏడు టోర్నీల్లో విఫలమవ్వడంపై మాత్రం దృష్టి పెట్టాల్సిందేనని గంగూలీ పేర్కొన్నాడు. మాజీ క్రికెటర్ గా ఎంతో అనుభవం ఉన్న గంగూలీ... బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కచ్చితంగా జట్టును మార్గనిర్దేశం చేస్తాడని నిపుణులు చెబుతున్నారు. ప్రతి మ్యాచ్ పైనా, ఆటగాడి ఆటపైన కూడా సమీక్షలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

సమీక్షలు నిర్వహించినప్పుడు... ఆటగాళ్లు తమ అత్యుతమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ ఇండియా మెగురైన జట్టు.  పెద్ద టోర్నీ గెలిచి టీం ఇండియాకు చాలా సంవత్సరాలు అయ్యిందని నాకు తెలుసు. సెమీఫైనల్స్, ఫైనల్స్ తప్పించి.. మిగిలిన మ్యాచులు బాగా ఆడారు. వీటిపై కెప్టెన్ కోహ్లీ తగిన శ్రద్ధ తీసుకొని పరిస్థితిని మార్చాలి’’ అని గంగూలీ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. 

click me!