India Vs West Indies: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్

By telugu teamFirst Published Dec 15, 2019, 1:07 PM IST
Highlights

భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్లో భాగంగా తొలి వన్డే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమవనుంది. ఇప్పుడే టాస్ ముగిసింది.  టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్  ఎంచుకుంది. 

చెన్నై: భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్లో భాగంగా తొలి వన్డే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమవనుంది. ఇప్పుడే టాస్ ముగిసింది.  టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్  ఎంచుకుంది. 

జట్ల బలాబలాల దృష్ట్యా భారత్‌, వెస్టిండీస్‌ నడుమ అగాధం కనిపిస్తున్నా ఈ రెండు జట్ల ముఖాముఖి పోరు ఎన్నడూ నిరాశపరిచిన చరిత్ర లేదు. అందుకే భారత్‌, వెస్టిండీస్‌ ముఖాముఖి అనగానే క్రికెట్‌ విందు అని చెప్పక తప్పదు. 

Also read: ఒక వైపే చూడు: కెఎల్ రాహుల్ దూకుడు వ్యూహం ఇదే...

ఉత్కంఠభరితంగా సాగిన టీ20 సిరీస్‌ను 2-1తో భారత్‌ గెల్చుకున్నా.. వెస్టిండీస్‌ గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు వన్డేల్లోనూ కరీబియన్‌ బృందం అదే పోరాట స్ఫూర్తి కనబరచాలని తాపత్రయం. ఇదే సమయంలో వెస్టిండీస్‌పై భారత్‌ వరుసగా పదో వన్డే సిరీస్‌పై కన్నేయటంతో అరుదైన రికార్డు పరంగా ఈ సిరీస్‌ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో భరత్ బ్యాటింగ్ ను బట్టి అర్థమవుతుంది కాబట్టి తాను బౌలింగ్ ఎంచుకున్నట్టు విండీస్ కెప్టెన్ పోలార్డ్ చెప్పాడు.

ఇక విరాట్ కోహ్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేయడంపై సంతోషం వ్యక్తం చేసారు. టాస్ గెలిచుంటే తాను బ్యాటింగే ఎంచుకునేవాడినని అన్నాడు. పిచ్ చాల డ్రైగా కనపడుతుందని, అందువల్ల ఫస్ట్ బ్యాటింగ్ చేయడం మంచిదని భావించినట్టు చెప్పాడు. రానురాను పిచ్ మరింత స్లో అయ్యేలానే మనకు కనపడుతుంది. 

ఇక ఈ మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్, చాహల్, మనీష్ పండే, శార్థుల్ ఠాకూర్ బెంచ్ కె పరిమితమయ్యారు. పిచ్ బాగా టర్న్ అయ్యేవిధంగా కనపడుతుంది.   

click me!