ఐపీఎల్‌లో నీకంటే నాకే ఎక్కువ ట్రోఫీలు.. నువ్వు కాదు నేనే తోపును.. బ్రావో వర్సెస్ పొలార్డ్ రచ్చ

By Srinivas MFirst Published Jun 2, 2023, 1:51 PM IST
Highlights

IPL 2023: వెస్టిండీస్  ఆల్ రౌండర్లు డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్ ల గురించి  ప్రత్యేకంగా  చెప్పాల్సిన పన్లేదు. ఈ విండీస్ వీరులు ఐపీఎల్ లో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. 

ఐపీఎల్ లో ‘ఎల్ క్లాసికో’ అని అభివర్ణించే  చెన్నై సూపర్ కింగ్స్ - ముంబై ఇండియన్స్  మ్యాచ్ తో పాటు ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య   వైరం కూడా అంతే ఇంటెన్సిటీతో ఉంటుంది. అయితే ఇదంతా ఆన్ ఫీల్డ్ లోనే.. మైదానం దాటిందంటే  ఇరు జట్ల ఆటగాళ్లు కలిసిపోతారు.  ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్ అయిన ఈ రెండు జట్ల మధ్య ఉన్న సంబంధాల మాదిరిగానే  విండీస్ ఆల్ రౌండర్స్ డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్ ల మధ్య కూడా  సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ  విండీస్ జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్ లో  ఎన్నో ఘనతలు అందుకున్నారు. 

ఐపీఎల్-16 లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ సాధించిన తర్వాత  బ్రావో.. పొలార్డ్ తో ఆసక్తికర చర్చకు తెరలేపాడు.  ఈ ఇద్దరూ   ఇప్పటికే  ఇండియా వదిలి విండీస్ కు చేరుకున్నారు.  అయితే ఐపీఎల్ ఫీవర్ ముగిసినా ఈ  ఇద్దరూ మాత్రం ఇంకా ఆ మత్తు నుంచి బయటపడలేదు. 

విండీస్ లో ఇద్దరూ కలిసి ఓ కారులో ప్రయాణిస్తూ ‘నువ్వు గొప్పా నేను గొప్పా..? నీ టీమ్ గొప్పదా..? నా టీమ్ గొప్పదా..?’ అన్న డిస్కషన్ పెట్టుకున్నారు.   ఈ ఇద్దరి మధ్య జరిగిన  మాటల యుద్ధం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.  ఈ వీడియోను  బ్రావోనే తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా  పంచుకున్నాడు.  

 

వీడియోను షేర్ చేస్తూ బ్రావో... ‘ఎవరైనా ఈ చర్చను పరిష్కరించడానికి నాకు సాయం చేయగలరా..?  కీరన్ పొలార్డ్ ఐపీఎల్ లో తన జట్టు (మంబై ఇండియన్స్) మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అని నమ్ముతున్నాడు. కానీ నేను  ప్రాతినిథ్యం వహించే చెన్నై రికార్డులు చూడండి .   పోలార్డ్   ట్రోఫీల గురించి మాట్లాడుతున్నాడు.  నాకు ఇది నా టీ20 కెరీర్ లో  17వ టైటిల్. ఈ రికార్డులు కూడా అతడికి చూపించండి. పొలార్డ్ ఇంకా 15 ట్రోఫీలతో నాకంటే రెండడుగులు దూరంలోనే ఉన్నాడు. దయచేసి ఎవరైనా ఈ డిబేట్  కు పరిష్కారం చూపించండి..’అని కామెంట్ చేశాడు. 

కాగా  ఐపీఎల్ లో ఈ ఇద్దరు దిగ్గజాలు గతేడాది  రిటైర్మెంట్ ప్రకటించి వారు ప్రాతినిథ్యం వహించిన జట్లకే కోచింగ్ సిబ్బందిగా వచ్చారు. బ్రావో.. చెన్నై సూపర్ కింగ్స్ కు బౌలింగ్ మెంటార్ గా  నియమితుడు కాగా  పొలార్డ్.. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్  కోచ్ గా ఉన్నాడు. అయితే తొలి ప్రయత్నంలో  బ్రావో కోచ్ గా కూడా ట్రోఫీ కొట్టగా పొలార్డ్ ఇంకా ఆ అడుగు వేయలేదు. 

click me!