మొన్న‘బుట్ట బొమ్మ’.. నేడు‘సన్నాజాజి పడక’ అంటున్న వార్నర్

Published : May 09, 2020, 02:01 PM IST
మొన్న‘బుట్ట బొమ్మ’.. నేడు‘సన్నాజాజి పడక’ అంటున్న వార్నర్

సారాంశం

చాలా మంది తమ ఫిట్నెస్ మీద ఫోకస్ పెడితే.. వార్నర్ మాత్రం.. ఇంట్లో ఉంటూనే ప్రజలను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. అది కూడా టిక్ టాక్ లో డ్యాన్సులు చేస్తూ... అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం ఏమిటంటే... వార్నర్ తెలుగు, తమిళ పాటలకు కాళ్లు కదపడమే.

ఆస్ట్రేలియా ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ మైదానంలో బ్యాట్ పట్టుకొని ఎలా చెలరేగిపోతాడో ప్రత్యేకంగా ఎవరికీ  చెప్పక్కర్లేదు. అయితే... ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా యావత్ క్రీడా ప్రపంచమే స్థంభించిపోయింది. దీంతో.. క్రికెటర్లంతా ఖాళీగా ఉండిపోయారు.

చాలా మంది తమ ఫిట్నెస్ మీద ఫోకస్ పెడితే.. వార్నర్ మాత్రం.. ఇంట్లో ఉంటూనే ప్రజలను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. అది కూడా టిక్ టాక్ లో డ్యాన్సులు చేస్తూ... అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం ఏమిటంటే... వార్నర్ తెలుగు, తమిళ పాటలకు కాళ్లు కదపడమే.

వార్నర్ తోపాటు ఆయన భార్య.. పిల్లలు కూడా ముద్దుగా ముద్దుగా డ్యాన్సులు వేస్తున్నారు. మొన్నటికి మొన్న అలవైకుంఠ పురం సినిమాలోని బుట్ట బొమ్మ పాటకు డ్యాన్స్ వేశారు. ఆ డ్యాన్స్ కి అల్లు అర్జున్ కూడా స్పందించాడు. ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. తాజాగా.. మరో పాటకి డ్యాన్స్ వేశాడు.

సన్నాజాజి పడక అనే పాటకి వార్నర్, ఆయన భార్య , కుమార్తె డ్యాన్స్ వేయగా.. ఆ వీడియోకూడా ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది. అంతేకాదు.. తెలుగు సినిమాల గురించి వార్నర్.. టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో చర్చించడం విశేషం.

PREV
click me!

Recommended Stories

Famous Batsmens : పసికూనలపైనే వీరి ప్రతాపం.. అభిమానులను బోల్తా కొట్టించిన టాప్ 5 క్రికెటర్లు
T20 World Cup : వన్ మ్యాన్ ఆర్మీ కోహ్లీ నుంచి హిట్‌మ్యాన్ రోహిత్ దాకా.. ఈ లిస్ట్ చూస్తే గూస్‌బంప్స్ పక్కా !