కోల్ కతాపై ఓటమి: బౌలర్లపై విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి

By telugu teamFirst Published Apr 6, 2019, 6:56 PM IST
Highlights

మ్యాచ్‌ ఫలితాన్ని ఎవ్వరూ ఊహించి ఉండరని, చివరి నాలుగు ఓవర్లలో మ్యాచ్‌ స్వరూపం మారిపోయిందని కోహ్లీ అన్నాడు. మ్యాచ్‌ గెలవడానికి కీలకంగా భావించే ఆ సమయంలో బౌలర్లు ఆకట్టుకోలేదని, దీన్ని తాను కూడా సమర్థించబోనని అన్నాడు.

బెంగళూరు: కోల్ కతా నైట్ రైడర్స్ పై శుక్రవారం జరిగిన మ్యాచులో తమ జట్టు ఓటమిపై రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. తమ బౌలర్ల పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారీ స్కోరు సాధించినప్పటికీ తమ జట్టు ఓటమి పాలు కావడం ఆయనకు మింగుడు పడడం లేదు.

కోహ్లి మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడాడు. మ్యాచ్‌ ఫలితాన్ని ఎవ్వరూ ఊహించి ఉండరని, చివరి నాలుగు ఓవర్లలో మ్యాచ్‌ స్వరూపం మారిపోయిందని కోహ్లీ అన్నాడు. మ్యాచ్‌ గెలవడానికి కీలకంగా భావించే ఆ సమయంలో బౌలర్లు ఆకట్టుకోలేదని, దీన్ని తాను కూడా సమర్థించబోనని అన్నాడు. 

తాము ఇక ముందు తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన సమయమని ఆయన అన్నాడు. ఈ సీజన్‌లో తమ ప్రదర్శన ఎవరికీ నచ్చలేదని తనకు తెలుసునని ఆయన అన్నాడు.. కీలక సమయాల్లో ధైర్యంగా బౌలింగ్‌ చేస్తేనే గెలుపును అందుకుంటామని అన్నాడు.

రసెల్‌ లాంటి పవర్‌ హిట్టర్లను ఎదుర్కోవాలంటే ఇంతకు మించిన ప్రదర్శన తమకు అవసరమని కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌లో అప్పటి వరకు కోహ్లీ సేన బోణీ కొట్టలేదు. వరుసగా ఐదు పరాజయాలను చవి చూసింది.

click me!