50 టెస్టుల్లో 30 విజయాలు: నాయకుడిగా కోహ్లీ మరో ఘనత

By Siva KodatiFirst Published Oct 13, 2019, 4:09 PM IST
Highlights

టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్‌లో తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన సారథుల్లో మూడో ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 

దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో పుణేలో జరిగిన రెండో టెస్టులో విజయం ద్వారా కెప్టెన్‌గా 30వ విజయాన్ని అందుకున్నాడు విరాట్. దీనితో పాటు 50వ టెస్టుకు నాయకత్వం వహించాడు.

తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న వారిలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు స్టీవ్ వా 37, రికీ పాంటింగ్‌లు మొదటి, రెండో స్థానంలో నిలిచారు.

మరోవైపు మొదటి 50 టెస్టుల్లో 30 విజయాలు అందుకున్న ఏకైక భారత కెప్టెన్ కోహ్లీయే కావడం విశేషం. అతని తర్వాత ధోని 27 టెస్టులతో నిలిచాడు.. కెప్టెన్‌గా మహేంద్రుడు 60 టెస్టులకు నాయకత్వం వహించాడు. కాగా పుణే టెస్టులో దక్షిణాఫ్రికాపై భారత్ ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

click me!