బాలీవుడ్ సెలబ్రెటీస్ తో... విరుష్క జోడి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

Published : Jan 01, 2020, 11:20 AM IST
బాలీవుడ్ సెలబ్రెటీస్ తో... విరుష్క జోడి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

సారాంశం

తొలుత అభిమానులకి విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలియజేయగా.. అనంతరం అనుష్క శర్మ అందుకుంటూ కోహ్లీని హత్తుకుని మరీ విషెస్ చెప్పింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలు న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. ఇద్దరికీ పని నుంచి కాస్త విరామం దొరకడంతో... ఈ బ్యూటిఫుల్ కపుల్ స్విట్జర్లాండ్ చెక్కేశారు. అక్కడి మంచులో తడిచి ముద్దౌతూ...అభిమానుల కోసం ఓవీడియో విడుదల చేశారు. తమ అభిమానులందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు.

తొలుత అభిమానులకి విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలియజేయగా.. అనంతరం అనుష్క శర్మ అందుకుంటూ కోహ్లీని హత్తుకుని మరీ విషెస్ చెప్పింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇదిలా ఉంటే... స్విట్జర్లాండ్ లో వీరి న్యూ ఇయర్ వేడుకలో మరికొందరు సెలబ్రెటీలు జత కలిశారు. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ జంట, యంగ్ హీరో వరుణ్ ధావన్ లు కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. వీరంతా కలిసి చేసుకుంటున్న సంబరాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరి పార్టీకి సంబంధించిన ఫోటోలను ఇద్దరూ తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

 

ఇదిలా ఉండగా .. భారత్, వెస్టిండీస్ మధ్య ఇటీవల వన్డే సిరీస్ ముగియగా.. టీమిండియా 2-1తో సిరీస్ చేజిక్కించుకుంది. ఇక శ్రీలంకతో జనవరి 5 నుంచి మూడు టీ20 సిరీస్ మొదలుకానుండగా.. దొరికిన ఈ బ్రేక్ సమయాన్ని సరదాగా అనుష్క శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఎంజాయ్ చేస్తున్నాడు. గత ఏడాది చివర్లో స్విట్లర్లాండ్ వెళ్లిన ఈ జంట.. గురువారం రాత్రికి మళ్లీ స్వదేశానికి రానున్నట్లు తెలుస్తోంది. 2017, డిసెంబరులో కోహ్లీ, అనుష్కలకి వివాహం జరగగా.. ఇటీవల భూటాన్‌లో రెండో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?