Vaibhav Surya: వైభవ్‌ వైల్డ్ ఫైర్‌ సెంచరీ.. పిల్లోడనుకున్నారు.. అదేం కొట్టుడురా అయ్యా!  

Published : Apr 28, 2025, 11:09 PM IST
Vaibhav Surya: వైభవ్‌ వైల్డ్ ఫైర్‌ సెంచరీ.. పిల్లోడనుకున్నారు.. అదేం కొట్టుడురా అయ్యా!  

సారాంశం

Vaibhav Surya Smashes Century: ఐపీఎల్‌ మ్యాచ్‌లలో రోజుకో సంచలనం నమోదువుతోంది. ఇవాళ జరిగిన మ్యాచ్లో కూడా రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ 14 ఏళ్ల పసివాడు వైభవ్‌ సూర్య గుజరాత్‌ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. బంతి పడటం ఆలస్యం గ్యాలరీకి పంపడమే తన లక్ష్యం అన్నట్లు చెలరేగిపోయాడు.... అత్యంత పిన్న వయసులో తక్కువ బంతుల్లో సెంచరీ బాది రికార్డులో నిలిచాడు.   

ఐపీఎల్‌ 2025, ఏప్రిల్‌ 28 సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ గుజరాత్‌ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ భారీ స్కోర్‌ సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన రాజస్తాన్‌ ఒపెనర్లు జైశ్వాల్‌, వైభవ్‌ గుజరాత్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా 14 ఏళ్ల వైభవ్‌ ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ప్రతి ఓవర్‌లో బౌండరీ, సిక్స్ కొట్టడమే లక్ష్యంగా గ్రౌండ్ నలువైపులా బంతిని పరుగులు పెట్టించాడు. కేవలం 35 బంతుల్లో 11 సిక్సులు, 7 ఫోర్లతో సెంచరీ సాధించాడు. 

వైభవ్‌ దాటికి రాజస్తాన్‌ జట్టు 12 ఓవర్లకు 150 పరుగులు సాధించింది. వైభవ్‌ విధ్వంసంతో లక్ష్యం బంతికి ఒక పరుగు చొప్పున చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ దశలో 28 బంతుల్లో 68 పరుగులు చేసిన వైభవ్‌.. ఆక్రమంలో 12వ ఓవర్‌ బౌలింగ్‌ చేసిన జమత్‌ను ఉతికి ఆరేశాడు. 6 బంతుల్లో 30 పరుగులు కొట్టాడు. ఒవర్‌ ముగిసే సరికి 98 పరుగులు చేరుకున్నాడు వైభవ్‌. ఆ తర్వాత రషీద్‌ ఖాన్‌ వేసిన తొలి బంతికే సిక్స్‌ కొట్టాడు. దీంతో 35 బంతుల్లో సెంచరీ చేశాడు. 

14 ఏళ్ల వయసులో తక్కువ బంతుల్లో సెంచరీ  సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ వ్యాప్తంగా వేగవంతమైన సెంచరీల్లో గేల్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. గేల్‌ 30 బంతుల్లో సెంచరీ చేయగా.. వైభవ్‌ 35 బంతుల్లో వంద కొట్టాడు. ఆ తర్వాత యూసఫ్‌ పఠాన్‌ 37 బంతుల్లో చేశాడు. ఆ తర్వాత వరుసలో మిల్లర్ 38, ప్రియాన్స్‌ ఆర్య 39 బంతుల్లో సెంచరీలు చేశారు. అయితే.. తొమ్మిదో తరగతి కుర్రాడు వైభవ్‌ ప్రపంచ స్థాయి బౌలర్లను చెడుగుడు ఆడిన తీరును చూసిన ప్రేక్షకులు, జట్టు సభ్యులు కేరింతలు కొట్టారు. పాయింట్ టేబుల్లో 2వ స్థానంలో ఉన్న గుజరాత్‌ జట్టు, 9వ స్థానంలో ఉన్న రాజస్థాన్‌ టీం 210 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది. రాజస్తాన్‌ బ్యాటింగ్‌ దెబ్బకు మరో 50 పరుగులు చేయాల్సి ఉన్నా అలవోకగా చేధించేవారు. 15.5 ఓవర్లకు రెండు వికెట్లు నష్టపోయి 210 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్‌ చేదించింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cricket Records: క్రికెట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ షాక్.. 27 పరుగులకే ఆలౌట్.. కేవలం 5 బంతుల్లోనే మ్యాచ్ ఫినిష్
Team India : వైభవ్ సూర్యవంశీ కాదు.. సంజూ శాంసన్ కాదు.. కోహ్లీని రీప్లేస్ చేస్తున్న సీఎస్కే స్టార్ ఎవరో తెలుసా?