Rishabh Pant: ఇంటర్వ్యూలలో ఆరోపణలు.. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు.. పంత్‌పై ప్రేమ ఒలకబోస్తున్న ఊర్వశి

Published : Oct 04, 2022, 04:52 PM IST
Rishabh Pant: ఇంటర్వ్యూలలో ఆరోపణలు..  సోషల్ మీడియాలో శుభాకాంక్షలు.. పంత్‌పై ప్రేమ ఒలకబోస్తున్న ఊర్వశి

సారాంశం

Rishabh Pant Birthday: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్  నేడు  25వ బర్త్ డే జరుపుకుంటున్నాడు. అతడి మాజీ  ప్రేయసి (?) ఊర్వశి రౌతేలా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా  బర్త్ డే విషెస్  చెప్పింది. 

ఇంటర్వ్యూలలో ‘మిస్టర్ ఆర్‌పీ’ అంటూ రిషభ్ పంత్ పేరెత్తకుండా అతడిపై ఆరోపణలను గుప్పించే బాలీవుడ్ వర్ధమాన నటి ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో మాత్రం అతడిపై అవకాశం చిక్కినప్పుడల్లా ప్రేమ వెల్లడిస్తూనే ఉంది. తాజాగా అతడి పుట్టినరోజు సందర్భంగా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో  ఓ రీల్ షేర్  చేస్తూ  బర్త్ డే విషెస్ తెలిపింది.  అయితే  ఈ రీల్ లో  ఆర్పీ పేరును కూడా ప్రస్తావించకున్నా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బర్త్ డే కు సంబంధించినదే కావడం గమనార్హం.

రిషభ్ పంత్ నేడు (అక్టోబర్ 4న) తన 25వ బర్త్ డే జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి జట్టు సహచరులతో పాటు ఫ్యాన్స్ బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక పంత్  పుట్టినరోజును పురస్కరించుకుని ఊర్వశి కూడా తన ఇన్స్టా ఖాతాలో  ఓ ఆసక్తికర రీల్ ను షేర్ చేసింది. 

బ్యాక్ గ్రౌండ్ లో బర్త్ డే ఆడియో వినిపిస్తుండగా.. పంత్ కోసం ఎదురుచూస్తున్న కళ్లతో విరహ  వేదనను అనుభవిస్తూ అతడికి ముద్దులతో ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పింది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే’ అని రాస్తూ  రెడ్ బెలూన్, స్టార్స్  ఎమెజీలతో విషెస్ చెప్పింది.  అయితే ఈ రీల్ లో ఆమె ఎవరికి బర్త్ డే విషెస్ చెప్పిందనే విషయం స్పష్టంగా తెలపకపోయినా.. నెటిజనులు మాత్రం ఈ ముద్దులు  పంత్ కోసమేనని అంటున్నారు.  

 

‘నేడు రిషభ్ పంత్ బర్త్ డే.. అతడికే ఈ ముద్దులు..’, ‘హ్యాపీ బర్త్ డే ఆర్పీ17, ఈ విషెస్ నీకోసమే. అర్థమవుతుందా..’, ‘రిషభ్ పంత్ బాబూ.. కొంచెం మనసులో ఉంచుకో..’, ‘ఇంటర్వ్యూలలో అయితే ఆర్పీ అని ఆగ్రహంతో మాట్లాడతావ్.  అతడి పేరు చెప్పమంటే చెప్పవు.  సోషల్ మీడియాలో అయితే హింట్స్ ఇస్తున్నావ్.. చెప్పలేని ప్రేమ ఒలకబోస్తున్నావ్...’ అని కామెంట్లతో  హోరెత్తిస్తున్నారు. తొలుత  పంత్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించిన ఊర్వశి తర్వాత అతడిని కాక పట్టేందుకు  ప్రయత్నిస్తున్నది. కానీ పంత్  మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. మరికొందరు నెటిజన్లు మాత్రం.. ‘పాపం పంత్.. పంతాలు చాలించి ఇకనైనా పట్టించుకో..’ అని సూచిస్తున్నారు. తాజాగా ఇన్స్టాలో ఊర్వశి పెట్టిన వీడియోపై ఇప్పటికే 4.6 లక్షల మందికి పైగా లైక్ చేశారు. వేల  సంఖ్యలో షేర్లు కూడా వచ్చాయి. 

ఇక రిషభ్ భారత జట్టు తరఫున 31 టెస్టులు ఆడి 43.33 సగటుతో  2,123 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలున్నాయి. 27  వన్డేలలో 840 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఐదు అర్థ సెంచరీలున్నాయి. 48 టీ20లలో 741 పరుగులు  సాధించాడు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?