వయసు తక్కువగా చెప్పాడని... ఇండియన్ క్రికెటర్ పై ఏడాది నిషేధం

By telugu teamFirst Published Jan 2, 2020, 12:11 PM IST
Highlights

దేశవాళీ అండర్‌–16, అండర్‌–19 వయో విభాగాల్లో ఆడిన సమయంలో కాల్రా అసలు వయసుకంటే తక్కువ వయసు చూపి జట్లలోకి ఎంపికయ్యాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు తప్పని కాల్రా రుజువు చేయలేకపోయాడు. 


ఇండియన్ యువ క్రికెటర్ మన్ జ్యోత్ కాల్రాపై ఢిల్లీ జిల్లా క్రికెట్  సంఘం ఏడాదిపాటు నిషేధం విధించింది. రెండేళ్ల క్రితం న్యూజిలాండ్ తో ఆస్ట్రేలియాతో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్స్ లో సెంచరీ చేసి జట్టును గెలిపించిన మన్ జ్యోత్ పై ఇప్పుడు నిషేధం విధించారు. రంజీ ట్రోఫీ మ్యాచుల్లో ఆడకుండా ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం నిషేధం విధించింది.

దేశవాళీ అండర్‌–16, అండర్‌–19 వయో విభాగాల్లో ఆడిన సమయంలో కాల్రా అసలు వయసుకంటే తక్కువ వయసు చూపి జట్లలోకి ఎంపికయ్యాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు తప్పని కాల్రా రుజువు చేయలేకపోయాడు. దాంతో కాల్రాపై ఏజ్‌ గ్రూప్‌ క్రికెట్‌ ఆడకుండా రెండేళ్లు... రంజీ ట్రోఫీ ఆడకుండా ఏడాదిపాటు నిషేధం విధిస్తున్నట్లు డీడీసీఏ అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ (రిటైర్డ్‌) బదర్‌ దురెజ్‌ ప్రకటించారు..

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి రికార్డుల ప్రకారం మన్‌జ్యోత్‌ కాల్రా ప్రస్తుత వయస్సు 20 ఏళ్ల 351 రోజులుగా ఉంది. ఇటీవలే అండర్‌–23 క్రికెట్‌ టోర్నీలో బెంగాల్‌తో మ్యాచ్‌లో కాల్రా 80 పరుగులు చేశాడు. ఓపెనర్‌ ధావన్‌ లంకతో టి20 సిరీస్‌కు ఎంపిక కావడంతో అతని స్థానంలో కాల్రా ఢిల్లీ జట్టులోకి రావడం ఖాయమైంది. అయితే అంబుడ్స్‌మన్‌ తాజా నిర్ణయంతో కాల్రా ఎలాంటి క్రికెట్‌ ఆడే అవకాశం లేకుండా పోయింది.

click me!