ప్రపంచంలో ఎక్కడా ఇలా జరుగదు : ఇండోర్ పిచ్‌పై మాథ్యూ హెడెన్ కామెంట్స్.. రవిశాస్త్రి అదిరిపోయే రిప్లే

Published : Mar 01, 2023, 03:08 PM IST
ప్రపంచంలో ఎక్కడా ఇలా జరుగదు : ఇండోర్ పిచ్‌పై మాథ్యూ హెడెన్ కామెంట్స్.. రవిశాస్త్రి అదిరిపోయే రిప్లే

సారాంశం

INDvsAUS 3rd Test: భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో   రోహిత్ సేన  ఆసీస్ స్పిన్నర్లకు దాసోహమైంది.  తొలి ఓవర్ నుంచే  స్పిన్ కు అనుకూలించిన ఈ పిచ్ పై ఆ జట్టు స్పిన్నర్లు రెచ్చిపోయారు. 

ఇండోర్ వేదికగా జరుగుతున్న భారత్ - ఆస్ట్రేలియా మూడో టెస్టులో తొలి రోజు ఉదయం ఆట నుంచే పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్  ఇండోర్ పిచ్ పై  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ పిచ్ మీద తనకు  కంప్లైట్స్ ఉన్నాయని అన్నాడు. మరీ  ఆరో  ఓవర్ లోనే ఒక స్పిన్నర్ బౌలింగ్ కు రావడం ప్రపంచంలో ఎక్కడా జరగదని  కామెంట్స్ చేశాడు. 

పిచ్ పరిస్థితులను బట్టి  ముందే పసిగట్టిన ఆసీస్ తాత్కాలిక సారథి స్టీవ్ స్మిత్.. భారత ఇన్నింగ్స్ లో  ఆరో ఓవర్ కే కున్హెమన్ కు  బంతినిచ్చాడు. ఈ ఓవర్లోనే అతడు రోహిత్ శర్మను బోల్తా కొట్టించాడు. తన తర్వాతి ఓవర్లో అతడు  ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ను కూడా ఔట్ చేశాడు. 

భారత జట్టు వెంటవెంటనే వికెట్లు కోల్పోతున్న సమయంలో కామెంట్రీ బాక్స్ లో ఉన్న మాథ్యూ హెడెన్ రవిశాస్త్రితో మాట్లాడుతూ... ‘టీమిండియా క్యాంప్ లో ఒక నిశ్శబ్దం అలుముకుంది.   గడిచిన రెండు టెస్టులలో వాళ్లు విజయం సాధించారు.  కానీ  ఈ టెస్టులో చూడండి పరిస్థితి ఎలా ఉందో.. ఆరో ఓవర్ నుంచే బంతి టర్న్ అవుతోంది.   నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఇలా జరుగదు.  ఈ పిచ్ మీద నాకు కంప్లెయింట్స్ ఉన్నాయి...

ఇండోర్ లో యావరేజీ టర్న్  4.8 డిగ్రీస్ గా ఉంది.  అది మాములు టర్న్ కాదు.  బంతి ఇలా టర్న్ అవడం  మనం మాములుగా మూడో రోజుకు గానీ చూడలేం. కానీ ఇప్పుడు తొలి గంటలోనే   బాల్ మెలికలు తిరుగుతోంది.  మీ (టీమిండియా) బ్యాటర్లకు కూడా బ్యాటింగ్ చేయడానికి ఛాన్స్ ఇవ్వాలి కదా రవి.  చూస్తుంటే ఈ టెస్టు కూడా మూడు రోజుల్లోనే ముగిసేలా ఉంది. నాలుగో రోజుకు వెళ్లేలా లేదు.  టెస్టు మ్యాచ్ లలో ఇలాంటి పిచ్ లు పనికిరావు...’అని చెప్పాడు. 

హెడెన్ కామెంట్స్ కు రవిశాస్త్రి కూడా  స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.  హెడెన్ మాట్లాడినదంతా ఓపికగా విని రెండే పదాల్లో అతడికి బదులిచ్చాడు. ‘హోం కండిషన్స్’ అని కాసేపు ఆగి..  ‘స్వదేశంలో  మ్యాచ్ అంటే మామూలుగా జరిగేదే ఇది.  కానీ ఇక్కడ పరిస్థితులు ఇంకాస్త కఠినంగా ఉన్నాయి.  ఒక్క మంచి భాగస్వామ్యం నెలకొల్పగలితే  కాస్త ప్రయోజనకరంగా ఉంటుంది...’అని శాస్త్రి  బదులిచ్చాడు. 

స్వదేశంలో ఎవరికి అనుకూలంగా వారు పిచ్ లను తయారుచేసుకోవడంలో  సదరు దేశానికి స్వేచ్ఛ ఉందని  ఈ విషయంలో హెడెన్ నీతులు చెప్పాల్సిన పన్లేదని టీమిండియా ఫ్యాన్స్ వాపోతున్నారు. అయినా ఆస్ట్రేలియా  మాజీ క్రికెటర్లు పిచ్ ల గురించి మాట్లాడటం  విచిత్రంగా ఉందని.. అడిలైడ్  పిచ్ తో పాటు ఇటీవల దక్షిణాఫ్రికా వారి దేశంలో పర్యటించినప్పుడు రెండో టెస్టుకు ఎలాంటి పిచ్ తయారుచేశారో మరిచిపోయారా..? అని కామెంట్ చేస్తున్నారు. రవిశాస్త్రి కూడా తాను చెప్పిన ‘హోం కండిషన్స్’ లో ఇదే  విషయాన్ని స్పష్టం చేయడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

5 Wickets in 1 Over : W, W, W, W, W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ కొత్త చరిత్ర
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !