కోహ్లీ పుట్టినరోజు... జీవితకాలం గుర్తుండిపోయే బహుమతి ఇచ్చిన అనుష్క

Arun Kumar P   | Asianet News
Published : Nov 06, 2020, 09:43 AM ISTUpdated : Nov 06, 2020, 10:17 AM IST
కోహ్లీ పుట్టినరోజు... జీవితకాలం గుర్తుండిపోయే బహుమతి ఇచ్చిన అనుష్క

సారాంశం

పుట్టినరోజు సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి తన ప్రేమను చాటిచెప్పే అద్భుతమైన బహుమతి ఇచ్చింది భార్య అనుష్క. 

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. 32వ పడిలోకి అడుగుపెట్టిన కోహ్లీకి తోటి టీమిండియా ప్లేయర్లు, రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పుట్టినరోజు జరుపుకుంటున్న భర్తకు తన ప్రేమను తెలియజేసేలా ఓ ముద్దుతో విషెస్ తెలిపింది భార్య అనుష్క శర్మ. 

కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా అతడితో కలిసున్న పోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది అనుష్క. భర్తకు ముద్దుపెడుతూ, అప్యాయంగా హత్తుకుని వున్న ఫోటోలను అనుష్క షేర్ చేస్తూ భర్తతో తనకున్న అనుబంధాన్ని తెలియజేసింది. ఇలా భర్తకు ప్రేమతో కూడిన పుట్టినరోజు విషెస్ తెలిపింది అనుష్క. 

ఇక ప్రస్తుతం ఐపిఎల్ 2020 కోసం యూఏఈ లో వున్న కోహ్లీ రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యులతో కలిసి పుట్టినరోజు జరుపుకున్నాడు. కెప్టెన్ కోహ్లీ పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపింది ఆర్సిబి యాజమాన్యం. '' ఎలా మొదలయ్యిందో ఎలా ముగిసిందో తెలియలేదు. కెప్టెన్ కోహ్లీ పుట్టినరోజు వేడుక అతని బ్యాటింగ్ లాగే అద్భుతంగా సాగింది'' అంటూ ఆర్సిబి ట్వీట్ చేసింది. 


 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !