ఇండియాతో మూడో టెస్టు: నాలుగేళ్లలో డేవిడ్ వార్నర్ తొలిసారి

By telugu teamFirst Published Jan 7, 2021, 8:35 AM IST
Highlights

ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. స్వదేశంలో వార్నర్ ఇలా అవుట్ కావడం గత నాలుగేళ్లలో ఇదే తొలిసారి.

సిడ్నీ: ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇంత ఘోరంగా అవుట్ కావడం గత నాలుగేళ్లలో ఇదే తొలిసారి. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డేవిడ్ వార్నర్ మహ్మద్ సిరాజ్ బౌలింగులో పుజారాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

స్వదేశంలో టెస్టు ఫార్మాట్ లో డేవిడ్ వార్నర్ రెండంకెల స్కోరు చేయకుండా అవుట్ కావడం గత నాలుగేళ్లలో ఇదే మొదటిసారి. 2016 నవంబర్ 12వవ తేదీన దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచులో వార్నర్ 1 పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత మళ్లీ ఈ రోజు ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. 

డేవిడ్ వార్నర్ రెండో వన్డే మ్యాచులో గాయపడ్డాడు. ఆ తర్వాత జరిగిన మూడు టీ20 సిరీస్ కు, తొలి రెండు టెస్టు మ్యాచులకు అతను దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న వార్నర్ మూడో టెస్టులో మైదానంలోకి దిగాడు. 

ఇదిలావుంటే, భారత్ తో జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ కేవలం 5 పరుగులు చేసి మహమ్మద్ సిరాజ్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు. పుజారాకు క్యాచ్ ఇచ్చి వార్నర్ వెనుదిరిగాడు. తద్వారా ఆరు పరుగుల స్కోరు వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది.

ఆస్ట్రేలియా ఏడు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది. దీంతో అర గంట ముందుగానే భోజన విరామ సమయాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత విల్ పకోస్కీ (14)తో కలిసి లబుషేన్ (2) బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. 

వారిద్దరు 7.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 21 పరుగులు చేశారు. అదే సమయంలో వర్షం కురవడంతో ఆటను నిలిపేశారు. బుమ్రా 4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. సిరాజ్ 3.1 ఓవర్లలో ఒక వికెట్ పడగొట్టాడు.

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ జట్టులోకి వచ్చాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కు జట్టులో స్థానం దక్కలేదు. గాయపడిన ఉమే,్ యాదవ్ స్థానంలో నవదీప్ సైనీ జట్టులోకి వచ్చాడు. టెస్టుల్లో భారత్ తరఫున 299వ ఆటగాడిగా సైనీ ఆరంగేంట్రం చేశాడు. 

సహచర ఆటగాళ్ల మధ్య సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా టెస్టు జట్టు క్యాప్ ను సైనీ అందుకు్నాడు. ఆస్ట్రేలియా తరఫున విల్ పకోవ్ స్కీ టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. 

భారత్ తుది జట్టు: అజింక్యా రహానే (కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, పుజారా, విహారి, రిషబ్ పంత్, అజయ్ జడేజా, రవిచంద్రన్ అశ్విన్, సిరాజ్, బుమ్రా, సైనీ

ఆస్ట్రేలియా తుది జట్టు: పైన్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పకోవ్ స్కీ, స్మిత్, లబూషేన్, వేడ్, గ్రీన్, కమిన్స్, స్టార్క్, హాజిల్ వుడ్, లయన్

click me!