విరాట్ కోహ్లీ, జడ్డూ నాకంటే బాగా చేశారు! టైం ఇస్తే నేర్చుకుంటా... షారుక్ ఖాన్ ట్వీట్...

Published : Feb 14, 2023, 04:36 PM IST
విరాట్ కోహ్లీ, జడ్డూ నాకంటే బాగా చేశారు! టైం ఇస్తే నేర్చుకుంటా... షారుక్ ఖాన్ ట్వీట్...

సారాంశం

నాగ్‌పూర్ టెస్టులో ‘పఠాన్’ మూవీ స్టెప్పులతో సందడి చేసిన విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా.. కోహ్లీ డ్యాన్స్‌పై ట్విట్టర్ ద్వారా స్పందించిన బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్.. 

విరాట్ కోహ్లీ క్రీజులో ఉంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదువే ఉండదు. బ్యాటింగ్‌ చేస్తుంటే బ్యూటీఫుల్ కవర్ డ్రైవ్స్, చూడచక్కని షాట్స్‌తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే విరాట్, ఫీల్డింగ్ చేసే సమయంలో కూడా బిజీ బిజీగా కనిపిస్తాడు. క్రీజులో కుదురుకుపోయిన బ్యాటర్లను సెడ్జ్ చేస్తూ ఆటలో డ్రామాని పెంచే విరాట్ కోహ్లీ, వికెట్ పడితే క్రేజీ స్టెప్పులతో ఇరగదీస్తుంటాడు..

విరాట్ కోహ్లీ చేసే డ్యాన్స్ స్టెప్స్‌కి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. తాజాగా నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి టెస్టులోనూ విరాట్ కోహ్లీ తన స్టెప్పులతో ప్రేక్షకులను అలరించాడు. భారత జట్టు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బ్రేక్‌లో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కలిసి షారుక్ ఖాన్ ‘పఠాన్’ మూవీలోని ‘జూమే జో పఠాన్’ స్టెప్పు వేశాడు...

విరాట్ కోహ్లీ తన స్టైల్‌లో స్టెప్పు వేయగా రవీంద్ర జడేజా ట్రై చేయబోయి ఆగిపోయాడు. ఈ వీడియోపై కొన్ని మాటలు చెప్పాల్సిందిగా షారుక్ ఖాన్‌ని అడిగాడు ఓ అభిమాని. దీనికి తన స్టైల్‌లో స్పందించిన షారుక్ ఖాన్... ‘వాళ్లు నా కంటే బాగా చేస్తున్నారు. విరాట్, జడేజా నుంచి ఎలా చేయాలో నేర్చుకుంటా..’ అంటూ సమాధానం ఇచ్చాడు...

డ్యాన్స్ సంగతి బాగానే ఉన్నా విరాట్ కోహ్లీ తొలి టెస్టుల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 26 బంతులు ఆడి 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన విరాట్, యంగ్ బౌలర్ టాడ్ ముర్ఫీ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

ఫీల్డింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ని స్లిప్‌లో జారవిడిచాడు విరాట్ కోహ్లీ. అయితే ప్యాట్ కమ్మిన్స్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖవాజా ఇచ్చిన క్యాచ్ అందుకున్నాడు...

మరోవైపు గాయంతో దాదాపు ఆరు నెలల పాటు టీమిండియాకి దూరంగా ఉన్న రవీంద్ర జడేజా, ఆల్‌రౌండ్ షోతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో 8 మెయిడిన్లతో 47 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా.. బ్యాటింగ్‌లో 70 పరుగులు చేశాడు. 

శ్రీకర్ భరత్ అవుటైన తర్వాత అక్షర్ పటేల్‌తో కలిసి 8వ వికెట్‌కి 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు రవీంద్ర జడేజా. 185 బంతుల్లో 9 ఫోర్లతో 70 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, రెండో ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు బౌలింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన జడ్డూ, టెస్టు కెరీర్‌లో 249 వికెట్ల దగ్గర ఉన్నాడు. జడ్డూ మరో వికెట్ తీస్తే 250 వికెట్ల క్లబ్‌లో చేరతాడు.. 

వరుసగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న బాలీవుడ్‌కి బాద్‌షా షారుక్ ‘పఠాన్’ తో కొత్త జీవం పోశాడు. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించిన ‘పఠాన్’... ‘బాహుబలి 2’, ‘కేజీఎఫ్ 2’ రికార్డులకు చేరువలో ఉంది.. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !