Ashes: యాషెస్ కు ఆరు వికెట్ల దూరంలో ఆసీస్.. బాక్సింగ్ డే టెస్టులో మరో పరాజయం దిశగా ఇంగ్లాండ్

Published : Dec 27, 2021, 02:30 PM ISTUpdated : Dec 27, 2021, 02:32 PM IST
Ashes: యాషెస్ కు ఆరు వికెట్ల దూరంలో ఆసీస్.. బాక్సింగ్ డే టెస్టులో మరో  పరాజయం దిశగా ఇంగ్లాండ్

సారాంశం

Australia Vs England: ప్రస్తుత పరిస్థితుల్లో ఆసీస్ పేస్ దళాన్ని తట్టుకోగలగడం ఇంగ్లాండ్ కు శక్తికి మించిన పనే..  రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది. మరో మూడు రోజుల ఆట మిగిలుంది. 

ప్రతిష్టాత్మక  యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ మరో పరాభావం ముంగిట నిలిచింది. ఆసీస్ బౌలర్ల ధాటికి ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్సులో ఆసీస్ ను తక్కువ స్కోరుకే కట్టడిచేసినా ఆనందం కూడా దక్కకుండా చేయడంలో కంగారూలు సఫలమయ్యారు. ఇప్పుడు తప్పకగెలవాల్సిన బాక్సింగ్ డే టెస్టులో విజయం సంగతి అటుంచితే కనీసం డ్రా చేసుకున్నా గొప్పే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆసీస్ పేస్ దళాన్ని తట్టుకోగలగడం ఇంగ్లాండ్ కు శక్తికి మించిన పనే. ప్రస్తుతం ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది.  ఇక స్వదేశంలో యాషెస్ ను నిలబెట్టుకోవడానికి ఆసీస్ కు మరో ఆరు వికెట్లు  మాత్రమే చాలు.. మిగిలిన రెండు టెస్టులతో పనిలేకుండా యాషెస్ ను దక్కించుకోవచ్చు.  

తొలి ఇన్నింగ్సులో ఆసీస్ ను 267 పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లాండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్లు మరోసారి విఫలమయ్యారు. రోరీ బర్న్స్ ను కాదని జాక్ క్రాలే ను జట్టులోకి ఎంపిక చేసినా అతడుకూడా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్సులో 12 పరుగులు చేసిన అతడు.. రెండో  ఇన్నింగ్సులో కూడా 5 పరుగులకే ఔటయ్యాడు. మరో ఓపెనర్ హసీబ్ హమీద్ (7) కూడా అదే బాట పట్టాడు. 

 

క్రాలే  ఔటయ్యాక వచ్చిన డేవిడ్ మలన్ (0) ఎదుర్కున్న తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. నైట్ వాచ్మెన్ గా వచ్చిన జాక్ లీచ్ (0) కూడా డకౌటయ్యాడు. దీంతో 22 పరుగులకే ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయింది. జో రూట్ (12 నాటౌట్) తో పాటు ఆల్ రౌండర్ బెన్ స్టెక్స్ (2 నాటౌట్) క్రీజులో ఉన్నారు.  ఇప్పుడు వీళ్లిద్దరి మీదే ఇంగ్లాండ్ ఆశలన్నీ.. వీరి తర్వాత జోస్ బట్లర్ ఒక్కడే మెయిన్ బ్యాటర్. కాగా.. మిచెల్ స్టార్క్,  స్కాట్ బొలాండ్ కు తలో రెండు వికెట్లు దక్కాయి.  

కష్టమే...?

మూడో టెస్టులో మరో  మూడు రోజుల ఆట బాకీ ఉంది. ఓటమిని తప్పించుకోవాలంటే కనీసం ఇంకో రోజున్నర అయినా ఇంగ్లాండ్ నిలువగలగాలి. క్రీజులో ఉండి  ఆసీస్ ముందు భారీ టార్గెట్ ను ఉంచి మళ్లీ ఆ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానిస్తే ఇంగ్లాండ్ కు కనీసం టెస్టును డ్రా చేసుకునే అవకాశమైనా ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లాండ్ కు ఆ ఛాన్సు కూడా డౌటే. మూడో రోజు రూట్, బెన్ స్టోక్స్ ఎంతమేర నిలదొక్కుకుంటారనేది ఆసక్తికరం. రూట్ కొంత ప్రతిఘటిస్తున్నా స్టోక్స్ ఫామ్ లో లేడు. 

 

మరోవైపు ఆసీస్ తొలి ఇన్నింగ్సులో 267 పరుగులకే ఆలౌట్ అయినా ఆ జట్టు 82 పరుగుల విలువైన ఆధిక్యాన్ని సంపాదించింది. దానిని ఛేదించే క్రమంలోనే ఇంగ్లాండ్ 31 పరుగులకే 4 వికెట్లను కోల్పోయింది. ఇప్పటికీ ఇంగ్లాండ్ ఇంకా 51 పరుగులు వెనుకబడే ఉంది. ఆట మూడో రోజు తొలి సెషన్ లో కంగారూ పేస్ దళాన్ని ఆ జట్టు ఏ మేర ఎదుర్కుంటుందో చూడాలి మరి.   

తొలి ఇన్నింగ్స్ లో ఓవర్ నైట్ స్కోరు 61 పరుగుల వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన  ఆసీస్.. 267 పరుగులకు ఆలౌట్ అయింది. మార్కస్ హారిస్ (76), వార్నర్  (38), హెడ్ (27), కమిన్స్ (21) రాణించారు.  

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?