The Ashes: నిప్పులు చెరిగిన అండర్సన్.. 267కే ఆసీస్ ఆలౌట్.. అయినా ఆధిక్యంలోనే ఆతిథ్య జట్టు

Published : Dec 27, 2021, 12:53 PM IST
The Ashes: నిప్పులు చెరిగిన అండర్సన్..  267కే ఆసీస్ ఆలౌట్.. అయినా ఆధిక్యంలోనే ఆతిథ్య జట్టు

సారాంశం

Australia Vs England: ఓవర్ నైట్ స్కోరు 61 పరుగుల వద్ద రెండో రోజు ప్రారంభించిన ఆసీస్.. 267 వద్ద ఆలౌట్ అయింది. కానీ ఆ ఆనందం కూడా ఇంగ్లాండ్ కు లేదు. రెండో ఇన్నింగ్స్ లో ఇప్పటికే ఆ జట్టు.... 

యాషెస్ సిరీస్ లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్  గ్రౌండ్ లో జరుగుతున్న  మూడో టెస్టులో  ఇంగ్లాండ్ బౌలర్లు రెచ్చిపోయారు. ఆ జట్టు వెటరన్ పేసర్ జేమ్స్  అండర్సన్ కు తోడుగా రాబిన్సన్, మార్క్ వుడ్ రాణించడంతో ఆస్ట్రేలియా జట్టు  తక్కువ స్కోరుకే తలవంచింది. ఓవర్ నైట్ స్కోరు 61 పరుగుల వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్.. మరో 200 పరుగులు జోడించి  ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్సులో ఆ జట్టు 267 పరుగులు చేసి ఆలౌట్ అయింది.  అండర్సన్ కు నాలుగు వికెట్లు దక్కాయి.  

ఓవర్ నైట్ స్కోరు 61 పరుగుల వద్ద రెండో రోజు ప్రారంభించిన ఆసీస్..  నైట్ వాచ్ మెన్ నాథన్ లియాన్ (10) వికెట్ ను త్వరగానే కోల్పోయింది.  ఆ తర్వాత వచ్చిన ఇన్ ఫామ్  బ్యాటర్, రెండో టెస్టులో సెంచరీ చేసిన లబూషేన్ (1) ఈసారి విఫలమయ్యాడు. మార్క్ వుడ్ బౌలింగ్ లో అతడు ఇంగ్లాండ్ సారథి జో రూట్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే ఆసీస్ వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (16) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ కు  చేరాడు. 31 బంతులు ఎదుర్కున్న స్మిత్ ను జేమ్స్ అండర్సన్ అద్భుత బంతితో బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్ 110 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 

 

స్మిత్ ఔటయ్యాక  క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్ (27) కాసేపు ప్రతిఘటించాడు. ఓపెనర్ మార్కస్ హారిస్ (76) తో కలిసి అతడు ఆసీస్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. ఇద్దరు క్రీజులో కుదురుకుంటున్న తరుణంలో రాబిన్సన్ మరోసారి ఆసీస్ ను దెబ్బకొట్టాడు. హెడ్ ను ఔట్ చేయడంతో 61 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 

హెడ్ నిష్క్రమించాక హారిస్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. అండర్సన్ బౌలింగ్ లో అతడు స్లిప్స్ లో ఉన్న రూట్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (19) పెద్దగా ఆకట్టుకోలేదు. ఆసీస్ సారథి పాట్ కమిన్స్ (21), స్టార్క్ (24) ధాటిగా ఆడినా కొద్దిసేపు మాత్రమే. దీంతో ఆసీస్.. 87.5 ఓవర్లో 267 పరుగుల వద్ద ముగిసింది. అండర్సన్ కు 4 వికెట్లు దక్కగా రాబిన్సన్, మార్క్ వుడ్ లు తలో 2 వికెట్లు దక్కించుకున్నారు. 

ఇంగ్లాండ్ కు అవే కష్టాలు.. 

తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ను ఇంగ్లాండ్ తక్కువ స్కోరుకే కట్టడి చేసినా కంగారూలదే ఆధిక్యం. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆసీస్ కు 82 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.  

 

ఇక ఆసీస్ ను తక్కువ స్కోరుకు కట్టడి చేశామన్న ఆనందం ఇంగ్లాండ్ కు ఎక్కువ సేపు నిలువలేదు. రెండో ఇన్నింగ్స్  ఆరంభించిన  ఇంగ్లాండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఏడో ఓవర్లో ఆ జట్టు ఓపెనర్ క్రాలే (5) కీపర్ కేరీ కి క్యాచ్ ఇచ్చి ఔటవ్వగా.. ఆ తర్వాత బంతికే డేవిడ్ మలన్ డకౌట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లు మిచెల్ స్కార్క్ కే దక్కాయి. ఈ రోజు మరో రెండు వికెట్లు పడితే ఇక ఇంగ్లాండ్ కు మరో ఘోర పరాభావం తప్పదు.. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?