మరోసారి టాప్ లేపిన కోహ్లీ... బుమ్రా, రహానే లు కూడా

By Arun Kumar PFirst Published Aug 27, 2019, 6:45 PM IST
Highlights

తాాజాగా ఐసిసి  ప్రకటించిన ర్యాకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు అత్యుత్తమ స్థానాలకు చేరుకున్నారు. వెస్టిండిస్ పర్యటనలో అదరగొట్టిన ఆటగాళ్లు మంచి ర్యాంకులను కైవసం చేసుకున్నారు.    

ఐసిసి ప్రకటించిన ర్యాకింగ్స్ లో టీమిండియా మరోసారి సత్తాచాటింది. ఇటీవల వెస్టిండిస్ తో ముగిసిన మొదటి టెస్ట్ లో అదరగొట్టిన భారత ఆటగాళ్లు తమ ర్యాకింగ్స్ ను మెరుగుపర్చుకున్నారు. అలా యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా, బ్యాట్స్ మెన్ అజింక్య రహానే లు అత్యుత్తమ ర్యాకులకు చేరుకున్నారు. అలాగే టెస్ట్ ర్యాకింగ్స్ లో టీమిండియా, కెప్టెన్ విరాట్ కోహ్లీ లు తమ స్ధానాలను పదిలపర్చుకుని నెంబర్ వన్ కొనసాగుతున్నారు.   

ముఖ్యంగా వన్డే బౌలర్లలో టాప్ లో కొనసాగుతున్న బుమ్రా టెస్ట్ ర్యాకింగ్స్ లో టాప్ టెన్ లోకి చేరాడు. అతడు 774  పాయింట్లతో ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఇలా టెస్ట్ ర్యాకింగ్స్ లో బుమ్రా టాప్ టెన్ లో చోటు దక్కించుకోవడం ఇదే మొదటిసారి. ఇతడితో పాటు రవీంద్ర జడేజా  763 పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. భారత్ తరపున వీరిద్దరు మాత్రమే టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నారు. 

వెస్టిండిస్ తో జరిగిన మొదటి టెస్ట్ లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న కెప్టెన్ కోహ్లీ 910 పాయింట్లతో టాప్ లో  కొనసాగుతున్నాడు. అలాగే మొదటి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీతో చెలరేగిన వైస్ కెప్టెన్ రహానే ఏకంగా 10 స్థానాలను ఎగబాకాడు. ఇంతకుముందు 21వ స్థానంలో నిలిచిన అతడు తాజా 904 రేటింగ్ పాయింట్లతో 11వ  స్థానానికి చేరుకున్నాడు. 

గాయం కారణంగా యాషెస్ సీరిస్ కు దూరమైనప్పటికి ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ 904 పాయింట్లో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. దీంతో ఇప్పట్లో కోహ్లీ టాప్ ర్యాంకుకు వచ్చిన ముప్పేమీ లేదు. ఇక ఇదే యాషెస్ సీరిస్ మూడో టెస్ట్  లో అజేయ సెంచరీతో అదరగొట్టిన బెన్ స్టోక్స్ బ్యాటింగ్ లో 13, ఆల్ రౌండర్స్ లో రెండో స్థానానికి ఎగబాకాడు. 
 

click me!