భారత్-వెస్టిండిస్ సీరిస్.... గేల్ రికార్డుపై కన్నేసిన రోహిత్

By Arun Kumar PFirst Published Aug 2, 2019, 6:47 PM IST
Highlights

టీమిండియా-వెస్టిండిస్ ల మధ్య శనివారం నుండి జరగనున్న టీ20 సీరిస్ ద్వారా రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు పై కన్నేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో గేల్ పేరిట వున్న రికార్డును రోహిత్ ఈ  సీరిస్ ద్వారా బద్దలుగొట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  

శనివారం భారత్-వెస్టిండిస్ మధ్య జరగనున్న టీ20 సీరిస్ లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును సాధించే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో అత్యధిక సిక్సర్ల రికార్డుకు అతడు అడుగు దూరంలో నిలిచాడు. కేవలం మరో నాలుగు సిక్సర్లు బాదితే రోహిత్ ఖాతాలో మరో వరల్డ్ రికార్డ్ చేరిపోనుంది. ప్రస్తుతం అతడి ఫామ్  ను బట్టి చూస్తూఆ లాంఛనం రేపే పూర్తయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 

ప్రస్తుతం అంతర్జాతీయ టీ20  మ్యాచుల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు క్రిస్ గేల్ పేరిట వుంది. ఇప్పటివరకు ఈ  విండీస్ ఓపెనర్ 105 సిక్సర్లు బాది టాప్ లో వుండగా న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 103  సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత 102 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ మూడో స్థానంలో వున్నాడు. ప్రస్తుతం కెనడా గ్లోబల్ లీగ్ లో ఆడుతున్న గేల్ భారత్ తో జరిగే టీ20 సీరిస్ కు దూరమయ్యాడు. కాబట్టి ఈ సీరిస్ ద్వారా గేల్ రికార్డును రోహిత్ అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

విండీస్ పర్యటనకు ముందు ఇంగ్లాండ్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ రోహిత్ అదరగొట్టాడు. అతడు అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ ఏకంగా ఐదు సెంచరీలు బాది వరల్డ్ కప్ రికార్డులను బదద్లుగొట్టాడు. అంతేకాకుండా ప్రపంచ కప్ 2019 లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఇదే  ఊపు యూఎస్ఎ లో జరగనున్న టీ20 సీరిస్ లో కూడా కొనసాగితే గప్టిల్, గేల్ రికార్డులు ఒకేసారి బద్దలవనున్నాయి. 

click me!