ఆ నలుగురిని ఎదుర్కోవడం టీమిండియాకు కష్టమే: విండీస్ కోచ్

By Arun Kumar PFirst Published Aug 2, 2019, 5:34 PM IST
Highlights

రేపటి(శనివారం) నుండి ప్రారంభం కానున్న టీ20  సీరిస్ లో భారత్ పై విండీస్ చెలరేగడం ఖాయమని ఆ జట్టు కోచ్ ప్లాయిడ్ రీఫర్ తెలిపాడు. విండీస్ జట్టులోని ఓ నలుగురు ఆటగాళ్లను ఎదుర్కోవడం టీమిండియాకు కష్టంగా మారనుందని అతడు పేర్కొన్నాడు. 

భారత జట్టు వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీ20,వన్డే, టెస్ట్ సీరిసులు ఆడనుంది. అయితే ఈ సీరిస్ లు మొత్తం వెస్టిండిస్ లో కాకుండా వివిద దేశాల్లో జరగనున్నాయి. అలా యూఎస్ఎ వేదికన జరిగే టీ20 సీరిస్ లో విండీస్ ఆటగాళ్లను ఎదర్కోవడం టీమిండియాకు సవాల్ గా మారనుందని ఆ జట్టు కోచ్ ప్లాయిడ్ రీఫర్ తెలిపాడు. ముఖ్యంగా ఓ నలుగురు విండీస్ ఆటగాళ్లు భారత్ పై చెలరేగే అవకాశాలున్నాయని... వారిని అడ్డుకోవడం టీమిండియా ఆటగాళ్లకు సాధ్యం కాదని అతడు హెచ్చరించాడు.

''ప్రస్తుతం విండీస్ జట్టు మంచి సమతూకంతో వుంది. బ్రాత్ వైట్ సారథిగానే కాకుండా ఆలౌ రౌండర్ గా తానేంటో నిరూపించుకోడానికి సిద్దంగా వున్నాడు. ఇక కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్ లు కూడా జట్టులో చేరడంతో ఈ సీరిస్ మరింత  ఆసక్తికరంగా మారింది. వారు కూడా సత్తా చాటడానికి సిద్దంగా వున్నారు. ఇక యువ ఆటగాడు ఖారీ పియర్ కూడా అటు బౌలింగ్, ఇటు ఫీల్డింగ్ లోనూ గతకొంతకాలంగా అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడు. కాబట్టి ఈ నలుగురు టీమిండియా పై చెలరేగా అవకాశాలున్నాయి.'' అని రీఫర్ పేర్కొన్నాడు. 

ఈ టీ20 సీరిస్ ద్వారా అమెరికన్లే కాకుండా యూఎస్ఎ లో స్థిరపడ్డ ఎన్నారైలు కూడా క్రికెట్ మజాను ఆస్వాదించనున్నారు. ఇలా అమెరికాలో క్రికెట్ కు ఆదరణ పెంచాలన్నదే ఐసిసి లక్ష్యం కూడా. అందుకోసం గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలనే చేసింది. 2016 లోనూ వెస్టిండిస్-భారత్ ల మధ్య ఇలాగే రెండు టీ20 మ్యాచులను నిర్వహించింది. ఇలా ఇప్పటివరకు పొట్టి ఫార్మాట్ కు మ్యాచ్ లు 8 వరకు జరగ్గా అందులో భారత్-విండీస్ ల మధ్య జరిగినవే ఎక్కువగా వున్నాయి. 


 

click me!