icc U 19 cricket world cup 2024 : ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. 201 పరుగుల తేడాతో ఘన విజయం

By Siva Kodati  |  First Published Jan 25, 2024, 9:10 PM IST

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను 201 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. దీనిని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ కేవలం 100 పరుగులకు చాప చుట్టేసింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ముషీర్ ఖాన్ (118), కెప్టెన్ ఉదయ్ సహరన్ (75)లు తొలి వికెట్‌కు 156 పరుగులు జోడించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. మిగిలిన ఆటగాళ్లలో ఓపెనర్లు ఆదర్శ్ సింగ్ (17), అర్షిన్ కులకర్ణి (32), అరవెల్లి అవనీశ్ (22), సచిన్ దాస్ (21) పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో ఓలివర్ రిలే 3, జాన్ మెక్నాలీ 2, ఫిన్ లుటన్ ఒక వికెట్ పడగొట్టారు. 

Latest Videos

అనంతరం భారీ స్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ భారత బౌలర్ల ధాటికి కుప్పకూలింది. 45 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 100 లోపే ఆలౌట్ అవుతుందనుకున్న దశలో రిలే, ఫోర్కిన్‌లు పోరాడటంతో ఆ జట్టు 100 పరుగులను టచ్ చేయగలిగింది. ఐర్లాండ్ జట్టులో జోర్డాన్ నీల్ (11), ర్యాన్ హంటర్ (13), ఓలివర్ రిలే (15), డేనియల్ ఫోర్కిన్‌లు మాత్రమే రాణించగలిగారు. భారత బౌలర్లలో ధనుష్ గౌడ, మురుగన్ అభిషేక్, ఉదయ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 
 
click me!