IND vs ENG: టెస్ట్ మ్యాచ్ తొలి రోజే రికార్డులు బ్రేక్.. జైస్వాల్, జో రూట్‌ల కొత్త రికార్డులు

By Mahesh K  |  First Published Jan 25, 2024, 6:26 PM IST

ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు తొలి రోజున టీమిండియా ఆటగాళ్లు మెరిశారు. ఉభయ జట్ల ఆటగాళ్లు పలు రికార్డులను బ్రేక్ చేశారు. జోరూట్, యశస్వీ జైస్వాల్‌లు పరుగులతో ఈ ఫీట్లు సాధించారు.
 


INDIA vs ENGLAND: ఈ రోజు ఇండియా, ఇంగ్లాండ్‌ జట్టుల మధ్య ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు తొలి టెస్టు ప్రారంభమైంది. తొలి రోజే ఈ టెస్టు మ్యాచ్‌లో రికార్డులు బద్ధలయ్యాయి. ఉభయ జట్ల ఆటగాళ్ల పలు రికార్డులను సమం చేశారు. మరికొన్ని బ్రేక్ చేశారు. 

సచిన్ రికార్డు బ్రేక్ చేసిన జో రూట్:

Latest Videos

ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య  జరిగిన టెస్టు సిరీస్‌లలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా జో రూట్ నిలిచారు. ఇంతకు ముందు సచిన్ టెండుల్కర్ పేరిట ఈ రికార్డు ఉన్నది. ఇండియాపై 9 శతకాలు, 10 అర్ధ శతకాలు సాధించాడు. మొత్తం ఇండియాపై 2,555 పరుగులు చేశాడు. టెస్టుల్లో భారత్ పై అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ రికార్డును జో రూట్ తాజాగా సమం చేశాడు.

యశస్వి జైస్వాల్ రికార్డు:

టెస్టు మ్యాచ్‌లో తొలి రోజే ప్రత్యర్థి టీమ్‌ను ఆలౌట్ చేసి మరో టీమ్ బ్యాటింగ్ చేసిన సందర్భంలో అత్యధిక పరుగులు సాధించిన ఇండియా బ్యాట్స్‌మెన్‌లలో యశస్వీ జైస్వాల్ మెరిశాడు. 2005లో జింబాబ్వే టీమ్ పై గౌతం గంభీర్ 95 పరుగులు చేశాడు. ఆ తర్వాత అత్యధిక పరుగులు (76 పరుగులు) సాధించిన బ్యాట్స్‌మెన్ యశస్వీ జైస్వాల్. 2016లో వెస్ట్ ఇండీస్ పై కేఎల్ రాహుల్ 75 పరులు చేశాడు.

Also Read: INDvsENG: కుప్పకూలిన ఇంగ్లాండ్.. టీమిండియా సూపర్ పర్ఫార్మెన్స్.. చెలరేగిన బౌలర్లు, జైస్వాల్

జడేజా, అశ్విన్ సక్సెస్ పెయిర్

టీమిండియాలో టెస్టు మ్యాచ్‌లలో అశ్విన్, జడేలా సక్సెస్‌ఫుల్ స్పిన్నర్లుగా మారారు. కుంబ్లే, హర్భజన్‌లనూ వీరు అధిగమించారు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు తొలి రోజున జడేలా, అశ్విన్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. అక్సర్ పటేల్ రెండు వికెట్లు తీశాడు.

click me!