లగేజ్ పోగొట్టుకున్న మహ్మద్ సిరాజ్...!

By telugu news teamFirst Published Dec 28, 2022, 9:38 AM IST
Highlights

తన బ్యాగ్ పోయి 24గంటలు గడిచిందని.... ఇప్పటి వరకు అది తనకు లభించలేదని.. అందుకే ఎయిర్ లైన్స్ కి ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పడం గమనార్హం.
 

టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తన లగేజ్ పోగొట్టుకున్నాడు. ఎయిర్ లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా... సిరాజ్ తన బ్యాగ్ ఒకటి మిస్ చేసుకున్నాడు. గత వారం టీమిండియా బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు కోసం వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సరీస్ ముగిసిన అనంతరం.. సిరాజ్ ఢాకా నుంచి ముంబయికు చేరుకున్నాడు. అయితే.. తాను మూడు బ్యాగులతో చెక్ ఇన్ అవ్వగా... ఒక బ్యాగ్ మిస్ అయ్యిందని సిరాజ్ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు.


తన బ్యాగ్ పోయి 24గంటలు గడిచిందని.... ఇప్పటి వరకు అది తనకు లభించలేదని.. అందుకే ఎయిర్ లైన్స్ కి ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పడం గమనార్హం.


I was traveling to Mumbai from Dhaka via Delhi on 26th on flight UK182 & UK951 respectively. I had checked in three bags out of which 1 has been misplaced. I was assured the bag will be found and delivered within no time but till now I have not heard anything. 1/2 pic.twitter.com/Z1MMHiaSmR

— Mohammed Siraj (@mdsirajofficial)

 


“నేను 26వ తేదీన వరుసగా UK182 & UK951 విమానంలో ఢాకా నుండి ఢిల్లీ మీదుగా ముంబైకి ప్రయాణిస్తున్నాను. నేను మూడు బ్యాగ్‌లతో చెక్ ఇన్ అయ్యాను. వాటిలో 1 మిస్ అయ్యింది. కొద్దిసేపటిలో బ్యాగ్ కనుగొని డెలివరీ చేస్తారని ఎయిర్ లైన్స్ ప్రామిస్ చేశారు, కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు, ”అని సిరాజ్ ట్వీట్ చేశాడు.

“నా ముఖ్యమైన వస్తువులు అన్నీ ఆ బ్యాగ్ లోనే ఉన్నాయి. ప్రక్రియను వేగవంతం చేసి, హైదరాబాద్‌లో నాకు వీలైనంత త్వరగా బ్యాగ్‌ని డెలివరీ చేయమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.” అంటూ ఎయిర్ విస్తారాను ట్యాగ్ చేసి తన విన్నపాన్ని సిరాజ్ తెలియజేశారు.

కాగా.. ఆయన ట్వీట్ కి ఎయిర్ లైన్స్ కూడా స్పందించింది. తమ సిబ్బంది త్వరలోనే లగేజ్ వెతికి మీకు అందజేస్తారంటూ వారు రిప్లై ఇవ్వడం విశేషం.
 

click me!