కోహ్లీసేనకు అదే బలం... ప్రపంచ కప్ సాధించిపెట్టేదికూడా వారే: ఇయాన్ చాపెల్

By Arun Kumar PFirst Published May 27, 2019, 4:38 PM IST
Highlights

టీమిండియా అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. ఓపెనర్లు శిఖర్  ధావన్, రోహిత్ శర్మలను మొదలుకుని కెప్టెన్ కోహ్లీ, ధోని వంటి అద్భుతమైన బ్యాట్ మెన్స్ టీమిండియా సొంతం. కాబట్టి ప్రతిష్టాత్మక ఈ ప్రపంచ కప్ ట్రోపీని కూడా సాధించిపెట్టే సత్తా కూడా టీమిండియా బ్యాట్ మెన్స్ కు మాత్రమే వుందని భారత క్రికెట్ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ టీమిండియా బ్యాటింగ్ కంటే బౌలింగ్ విభాగమే అద్భుతంగా వుందని...వారికే ప్రపంచకప్ సాధించగల సత్తా వుందంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచ కప్ టోర్నీలో ప్రతి జట్టులోనూ బౌలర్లే కీలకంగా వ్యవహరించనున్నారని చాపెల్ పేర్కొన్నారు. విరామం లేకుండా ప్రత్యర్ధి బ్యాట్ మెన్స్ వికెట్లు పడగొట్టే జట్టుకే విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో ప్రత్యర్ధి బ్యట్ మెన్స్ పనిపట్టే జట్టే వరల్డ్ కప్ ట్రోపీని ముద్దాడగలదని చాపెల్ జోస్యం చెప్పారు. 

అయితే ఆ అవకాశాలు టీమిండియాకే ఎక్కువగా వున్నాయని ఆయన పేర్కొన్నారు.  ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా చక్కగా బౌలింగ్  చేయగల సామర్థ్యమున్న బౌలర్లు ఆ జట్టులో వున్నారన్నారు. పిచ్ పై  తేమ వుంటే బౌలర్లు జస్ప్రీత్ సింగ్ బుమ్రా, మహ్మద్ షమీ,  భువనేశ్వర్ కుమార్  లు ఆ పరిస్థితులను అదునుగా తీసుకొని రాణించగలని తెలిపారు. ఇక తేమ తగ్గి పిచ్ పొడిగా మారితే స్పిన్నర్లు కుల్దీప్ యాదవ, చాహల్ లు ఆ పరిస్థితిని  అదునుగా తీసుకుని వికెట్లు పడగొట్టగలరు. 

ఇక ఆల్ రౌండర్  హార్దిక్ పాండ్యా కూడా తనదైన రోజు అద్భుతాలు చేయగలడు. వీటన్నింటికి విరాట్ కోహ్లీ అద్భుతమైన కెప్టెన్సీ మరింత  బలాన్నిస్తుంది. కాబట్టి ఇలా ఏ పరిస్థితులనైనా ఎదుర్కోగల బౌలర్లున్న భారత జట్టే ఈ ప్రపంచ కప్ ట్రోపీ అందుకుంటుందని భావిస్తున్నట్లు ఇయాన్ చాపెల్ వెల్లడించారు. 

 ప్రపంచ కప్ వార్తలు  

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. జూన్ 16న పాక్‌తో భారత్ ఢీ

click me!