ప్లేస్ కోసం ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్ : అశ్విన్‌కు ఎర్త్ పెట్టిన విహారి

By Siva KodatiFirst Published Aug 27, 2019, 9:56 AM IST
Highlights

భారత జట్టులో స్థానం సంపాదించడం ఎంత కష్టమో... దానిని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. జట్టులో స్థానం కోసం ప్రతి ఒక్క క్రికెటర్ పోరాటం చేస్తూనే ఉంటాడు. తాజాగా టీమిండియాలో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ఆఫ్ స్పిన్‌కు పదును బెట్టుకోవాలని భావిస్తున్నాడు ఆంధ్రా కుర్రాడు హనుమ విహారి

భారత జట్టులో స్థానం సంపాదించడం ఎంత కష్టమో... దానిని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. జట్టులో స్థానం కోసం ప్రతి ఒక్క క్రికెటర్ పోరాటం చేస్తూనే ఉంటాడు. తాజాగా టీమిండియాలో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ఆఫ్ స్పిన్‌కు పదును బెట్టుకోవాలని భావిస్తున్నాడు ఆంధ్రా కుర్రాడు హనుమ విహారి.

తన కోసమే కాకుండా జట్టు కోసం కూడా నా ఆఫ్ స్పిన్ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలి.. అప్పడు ఐదో బౌలర్‌గా జట్టు కూర్పులో ఉంటానని విహారి అభిప్రాయపడ్డాడు.

తాను మెరుగైతే ఎక్కువ ఓవర్లు వేస్తానని.. అప్పుడు జట్టుకు మేలు జరుగుతుందని.. భారత క్రికెట్ జట్టులో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడైన అశ్విన్ సాయం అందుతున్నందుకు తాను అదృష్టవంతుడిని అని హనుమ విహారి పేర్కొన్నాడు.

భారత్-ఏ తరపున ఆడిన అనుభవంతో పిచ్ ఎలా స్పందింస్తుందో తనకు మంచి అవగాహన వుందని.. జట్టు అవసరాలు... కూర్పు మేరకు ఏ స్థానంలోనైనా ఆడతానని అతను స్పష్టం చేశాడు.

రహానెతో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పానని.. ప్రత్యర్థి బౌలర్లు ఎలా బంతులు వేస్తున్నారో రహానే చెప్పాడని విహారి తెలిపాడు. తృుటిలో సెంచరీ మిస్సయినా జట్టు విజయంలో భాగమైనందుకు సంతోషంగా వుందని హనుమ విహారీ తెలిపాడు. 

click me!