భార్యకు సాయం చేస్తూ.. పిల్లలతో ఆడుకుంటూ: లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్న పుజారా

By Siva KodatiFirst Published Mar 29, 2020, 6:35 PM IST
Highlights

కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇళ్లకే పరిమితమైపోయారు. 

కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇళ్లకే పరిమితమైపోయారు. క్షణం తీరిక లేకుండా గడిపేవారంతా ఈ ఖాళీ సమయాన్ని కుటుంబంతో, ఆత్మీయులతో గడుపుతున్నారు. టీమిండియా క్రికెటర్లు కూడా భార్యాపిల్లలతో ఏంజాయ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో భారత టెస్ట్ స్పెషలిస్ట్ ఛతేశ్వర్ పుజారా కుటుంబంతో గడుపుతున్న ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వీటిలో పుజారా తన కుమార్తెతో ఆడుకోవడంతో పాటు భార్యకు ఇంటి పనుల్లో సహాయం చేయడాన్ని చూడవచ్చు. ఇప్పటికే టీమిండియా క్రికెటర్లు ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, శిఖర్ ధావన్‌ల వీడియోలను బీసీసీఐ షేర్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:కరోనా లాక్ డౌన్: గర్ల్ ఫ్రెండ్ నటాషాతో కలిసి హార్దిక్ క్యూట్ వర్కౌట్... ఫోటో వైరల్

కాగా దేశంలో నానాటికి విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం మార్చి 24న దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 6 లక్షల మందికి పైగా వైరస్ సోకగా, 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

కోవిడ్ 19 సంక్షోభం కారణంగా అభిమానులు ఇంటి వద్దే ఉండాలని విజ్ఞప్తి చేస్తూ పలువురు క్రీడాకారులు లాక్‌డౌన్‌కు మద్ధతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల క్రీడలకు సంబంధించిన మెగా టోర్నమెంట్లు వాయిదా పడటమో, రద్దు కావడమో జరిగాయి.

Also Read:హెడ్డింగ్ కాదు.. వార్త మొత్తం చదువు.. అభిమానికి స్టోక్స్ పంచ్

ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2020ని ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే. భారత్‌లోనూ షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ తర్వాత దానిని తిరిగి కొనసాగించే పరిస్ధితులు దేశంలో కనిపించడం లేదు. 

 

The Pujara family is spending some quality time home 👨‍👩‍👧
Some household chores & fun time with the little one 👶
Stay Home 🏡
Stay Safe 💙 pic.twitter.com/FOW0qVv3sO

— BCCI (@BCCI)
click me!