భారత క్రికెట్ జట్టు ఫేసర్ మహమ్మద్ షమీపై ఆయన మాజీ భార్య జహన్ కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుత వరల్డ్ కప్ లో భారత విజయాల్లో మహమ్మద్ షమీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ:భారత క్రికెట్ జట్టులో అత్యుత్తమంగా రాణిస్తున్న ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ గురించి అతని మాజీ భార్య హసిన్ జహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ జట్టులో మహమ్మద్ షమీ ఎంత కాలం ఉంటే అంత మంచిదన్నారు. అదే తన భవిష్యత్తుకు భద్రతను కల్పిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో భారత జట్టు విజయాల్లో మహమ్మద్ షమీ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన షమీకి శుభాకాంక్షలు తెలిపేందుకు ఆమె నిరాకరించారు. భారత జట్టు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో షమీ ఆడలేదు. అయితే మిగిలన మ్యాచ్ ల్లో షమీకి జట్టులో ప్రాతినిథ్యం దక్కింది. ప్రపంచ కప్ లో నాలుగు వన్డే మ్యాచ్ లు ఆడిన షమీ 7.00 సగటుతో 16 వికెట్లు తీసుకున్నాడు.
న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికాతో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్ లలో షమీ ఆడాడు. రెండు మ్యాచ్ ల్లో షమీ ఐదేసి వికెట్ల చొప్పున 10 వికెట్లు తీసుకున్నాడు. మరో మ్యాచ్ లో నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు తీసిన నాలుగవ ఆటగాడిగా షమీ స్థానం సంపాదించాడు.
షమీ దేశం కోసం బాగా రాణిస్తే బాగా సంపాదిస్తాడని అతని మాజీ హసిన్ జహాన్ అభిప్రాయపడ్డారు. అదే తమ కుటుంబానికి ప్రయోజనమని కూడ ఆమె చెప్పారు.
భారత క్రికెట్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన మహమ్మద్ షమీపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే షమీ అత్యుత్తమ ప్రతిభకు శుభాకాంక్షలు కూడ చెప్పడానికి జహాన్ ఆసక్తిని చూపలేదు.
భారత క్రికెట్ జట్టుకు తన శుభాకాంక్షలు చెప్పారు. కానీ తన శుభాకాంక్షలు మాత్రం షమీకి కాదని ఆమె న్యూస్ నేషన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
మహమ్మద్ షమీతో జహన్ విడాకులు తీసుకున్నారు. షమీపై జహన్ ఫిక్సింగ్ కు సంబంధించిన ఆరోపణలు కూడ చేశారు. షమీ, జహన్ కు ఓ బిడ్డ కూడ ఉంది. తన మాజీ భార్య జహన్ చేసిన ఆరోపణలను షమీ కొట్టిపారేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తన దేశం కోసం ఆయన చనిపోతానన్నారు. కానీ దేశానికి ద్రోహం చేయబోనని చెప్పారు.
మహమ్మద్ షమీపై అరెస్టు వారంట్ పై స్టే ఎత్తివేయాలని ఈ ఏడాది ఆరంభంలో జహన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షమీ అరెస్టు వారంట్ పై కోల్ కత్తా సెషన్స్ కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.జహన్ , షమీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య విబేధాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.