టీ20 వరల్డ్ కప్ 2022: సెమీస్ చేరిన న్యూజిలాండ్... ముగిసిన ఐర్లాండ్ పోరాటం...

By Chinthakindhi Ramu  |  First Published Nov 4, 2022, 12:53 PM IST

ఐర్లాండ్‌ని ఓడించి సెమీ ఫైనల్ చేరిన న్యూజిలాండ్... ఇంగ్లాండ్‌ని ఓడించినా, సూపర్ 12 నుంచి ఇంటిదారి పట్టిన ఐర్లాండ్... 


టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో న్యూజిలాండ్ సెమీ ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న కివీస్, టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరుకోగా ఇంగ్లాండ్‌ని ఓడించి షాక్ ఇచ్చిన ఐర్లాండ్.. పెద్దగా సంచలనాలు లేకుండానే సూపర్ 12 రౌండ్ నుంచి ఇంటిదారి పట్టింది.. 186 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఐర్లాండ్, 9 వికెట్లు కోల్పోయి 150 పరుగులకి పరిమితమైంది.

186 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఐర్లాండ్‌కి శుభారంభం అందించారు ఓపెనర్లు.తొలి వికెట్‌కి 68 పరుగులు జోడించిన తర్వాత ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బార్బీనీ అవుట్ అయ్యాడు. 25 బంతుల్లో 3 సిక్సర్లతో 30 పరుగులు చేసిన ఆండ్రూని మిచెల్ సాంట్నర్ అవుట్ చేయగా పాల్ స్టిర్లింగ్ 27 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

Latest Videos

లోర్కన్ టక్కర్ 13, హారీ టెక్టర్ 2, గెరత్ డెలానీ 10, జార్జ్ డాక్రెల్ 23, కర్టీస్ కాంపర్ 7, ఫియోన్ హ్యాండ్ 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో లూకీ ఫర్గూసన్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా మిచెల్ సాంట్నర్, ఇష్ సోదీ, టిమ్ సౌథీ రెండేసి వికెట్లు తీశారు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది.. ఫిన్ ఆలెన్, డివాన్ కాన్వే కలిసి తొలి వికెట్‌కి 52 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 18 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన ఫిన్ ఆలెన్, మార్క్ అదైర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 33 బంతుల్లో 2 ఫోర్లతో 28 పరుగులు చేసిన డివాన్ కాన్వే, డెలనీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 

undefined

మొదటి నాలుగు మ్యాచుల్లో టెస్టు ఇన్నింగ్స్‌లతో ప్రేక్షకులను విసిగించిన కేన్ విలియంసన్, నేటి మ్యాచ్‌లోనూ మొదటి 15 బంతుల్లో 15 పరుగులే చేశాడు. అయితే ఆ తర్వాత గేర్ మార్చిన కేన్ విలియంసన్, వరుస బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 

గ్లెన్ ఫిలిప్స్ 9 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేయగా కేన్ విలియంసన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. కేన్ విలియంసన్‌ని అవుట్ చేసిన జోషువా లిటిల్, ఆ తర్వాతి బంతుల్లో వెంటవెంటనే జేమ్స్ నీశమ్, మిచెల్ సాంట్నర్‌లను పెవిలియన్ చేర్చాడు. కేన్ విలియంసన్ క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా మిగిలిన ఇద్దరూ ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరారు. డార్ల్ మిచెల్ 21 బంతుల్లో 2 ఫోర్లతో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

టీ20 వరల్డ్ కప్ 2022లో హ్యాట్రిక్ తీసిన రెండో ఐర్లాండ్ బౌలర్‌గా నిలిచాడు జోషువా లిటిల్. ఇంతకుముందు 2021లో నెదర్లాండ్స్‌ప కుర్టీస్ కాంపర్ హ్యాట్రిక్ తీశాడు. ఓవరాల్‌గా టీ20 వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ తీసిన ఆరో బౌలర్ జోష్ లిటిల్. ఇంతకుముందు 2007లో బ్రెట్ లీ హ్యాట్రిక్ తీయగా 2021లో కుర్టీస్ కాంపర్, వానిందు హసరంగ, కగిసో రబాడా హ్యాట్రిక్ వికెట్లు తీశారు... 2022లో శ్రీలంకపై యూఏఈ బౌలర్ కార్తీక్ మేయప్పన్ హ్యాట్రిక్ తీయగా న్యూజిలాండ్‌పై హ్యాట్రిక్ తీసిన మొదటి బౌలర్‌గా నిలిచాడు జోషువా లిటిల్... 

ఒకే ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు జోషువా లిటిల్. 2022లో జోష్ లిటిల్ ఇప్పటిదాకా 39 వికెట్లు తీయగా నేపాల్ బౌలర్ సందీప్ లమిచ్ఛానే 38 వికెట్లు తీశాడు. 

click me!