టెస్టు మ్యాచుల్లో అడుగుపెట్టిన నటరాజన్

By telugu news teamFirst Published Jan 2, 2021, 10:46 AM IST
Highlights

అకస్మాత్తుగా దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నట్టూ తన తొలి టి20 మ్యాచ్‌లోనే అద్భుతంగా రాణించి 30 పరుగులకే మూడు వికెట్లు సాధించి అందరితో శెహభాష్‌ అనిపించుకున్నాడు.

ఐపీఎల్ లో అందరి దృష్టి ఆకర్షించిన తమిళనాడు ఫాస్ట్ బౌలర్ నటరాజన్ కి మరో అవకాశం దక్కింది. ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో అరంగేట్రం చేసిన అతను.. ఇప్పుడు టెస్టుల్లోనూ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. 

ఐపిఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిరచి రాణించిన తమిళనాడుకు చెందిన ఈ ఎడమచేతి వాటం ఫాస్ట్‌ బౌలర్‌ నట్టూ( నటరాజన్) ఆస్ట్రేలియాలో జరుగుతున్న పర్యటనలో నెట్‌ బౌలర్‌గా వెళ్లాడు. ఇదే సమయంలో టి20లో స్పిన్నర్‌గా ఎంపికైన వరుణ్‌ చక్రవర్తి భుజం గాయం కారణంగా జట్టునుంచి వైదొలగడంతో ఆ స్థానాన్ని నట్టూతో భర్తీ చేశారు. 

అకస్మాత్తుగా దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నట్టూ తన తొలి టి20 మ్యాచ్‌లోనే అద్భుతంగా రాణించి 30 పరుగులకే మూడు వికెట్లు సాధించి అందరితో శెహభాష్‌ అనిపించుకున్నాడు. అయితే రెండో మ్యాచ్‌లో స్థానం కోల్పోయిన నట్టూ తిరిగి మూడో టి20లో స్థానం పొంది రెండు వికెట్లతో సత్తా చాటాడు.

ఇదే సమయంలో వన్డే సీరీస్‌లో నవదీప్‌ సైనీ తొలి రెండు మ్యాచుల్లో ఘోరంగా విఫలం కావడంతో అతని స్థానంలో మూడో వన్డేలోకి మళ్లీ నట్టూను తీసుకున్నారు. ఇందులో కూడా రాణిరచిన నట్టూ రెరడు వికెట్లు తీసుకున్నాడు. తొలి రెరడు మ్యాచ్‌లు ఓడిపోయిన భారత్‌ నట్టూ ఆడిన మూడో మ్యాచ్‌లో విజయం సాధించడం విశేషం.

ఇక టెస్టు సీరీస్‌లో తొలి టెస్ట్‌లో షమీ.. రెండు టెస్ట్‌లు ఆడిన ఉమేష్‌లు గాయాలతో జట్టుకు దూరం కాగా, ఉమేష్‌ స్థానంలో నటరాజన్‌కు జట్టులో చోటు కల్పించారు. ఇలా నెట్‌ బౌలర్‌గా వెళ్లిన ఈ ఎడమ చేతివాటం పేసర్‌ ఏకంగా మూడు ఫార్మాట్లలోనూ జట్టులో స్థానం సంపాదించడం, తానాడిన ప్రతి మ్యాచ్‌లోనూ భారత్‌ గెలుపొందడం విశేషం. ఇప్పుడు టెస్టుల్లోనూ రాణిస్తే జహీర్‌ఖాన్‌ తర్వాత భారత క్రికెట్‌ జట్టుకు ఓ మంచి లెఫ్ట్‌హారడ్‌ ఫాస్ట్‌బౌలర్‌ దొరికినట్టే. జస్ప్రీత్‌ బుమ్రాలా యార్కర్లను సంధించే బౌలర్‌గా కూడా ఇప్పటికే నట్టూకు పేరు సంపాదించాడు.

click me!