SRHvsMI: గెలిచి, ప్లేఆఫ్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ముంబైపై భారీ విజయం...

Published : Nov 03, 2020, 10:59 PM ISTUpdated : Nov 03, 2020, 11:04 PM IST
SRHvsMI: గెలిచి, ప్లేఆఫ్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ముంబైపై భారీ విజయం...

సారాంశం

హాఫ్ సెంచరీలు పూర్తిచేసుకున్న వృద్ధిమాన్ సాహా, డేవిడ్ వార్నర్... మొదటి వికెట్‌కి 151 పరుగుల భారీ భాగస్వామ్యం... డిఫెండింగ్ ఛాంపియన్‌ను ఓడించి ప్లేఆఫ్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

IPL 2020 సీజన్‌లో ప్లేఆఫ్ బెర్త్‌ను ఘనవిజయంతో కన్ఫార్మ్ చేసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ప్లేఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, టేబుల్ టాపర్ ముంబై ఇండియన్స్‌పై ఈజీ విక్టరీ సాధించింది సన్‌రైజర్స్. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా కలిసి మొదటి వికెట్‌కి 150+ పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, ముంబై బౌలర్లపై పూర్తి ఆధిక్యం ప్రదర్శించారు.

మొదటి నుంచి దూకుడుగా ఆడిన డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా హాఫ్ సెంచరీలు పూర్తిచేసుకున్నారు. డేవిడ్ వార్నర్ 57 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్లతో 85 పరుగులు చేయగా, వృద్ధిమాన్ సాహా 45 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సుతో 58పరుగులు చేశాడు. 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్ చేరింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ముంబైకి సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడడం ఇదే తొలిసారి.

ఈ విజయంతో ప్లేఆఫ్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నవంబర్ 6న రాయల్ ఛాలెంజర్స్ హైదరాబాద్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలబడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకి ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఓడిన జట్టుతో ఫైనల్ చేరేందుకు పోటీపడే అవకాశం దక్కుతుంది. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026 : సూర్య సేన సిద్ధం.. కోహ్లీ, రోహిత్ లేని లోటు తీర్చేస్తారా?
U19 World Cup 2026: భారత్ ఖాతాలో మరో ప్రపంచకప్.. ఇంగ్లాండ్‌ను దంచికొట్టిన కుర్రాళ్లు !